- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kanguva: రాజును ఆహ్వానించడానికి మీరు సిద్ధమా.. ‘కంగువ’ ఆడియో లాంచ్ డేట్ ఫిక్స్
దిశ, సినిమా: స్టార్ హీరో సూర్య (Surya) నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’ (Kanguva). పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి శివ (Shiva) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో దిశ పటానీ (Disha Patani), బాబీ డియోల్ (Bobby Deol) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్ (Studio Green), యూవీ క్రియేషన్స్ (UV Creations) బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ దసరా సందర్భంగా అక్టోబర్ 10న రిలీజ్ కావాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల చేత రిలీజ్ పోస్ట్ పోన్ చేశారు. ఇక ఈ చిత్రం నవంబర్ 14న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.
ఇక రిలీజ్ సమయం దగ్గరపడటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే ‘కంగువ’ ఆడియో లాంచ్ (audio launch)కు సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది. ఈ మేరకు ‘రాజును స్వాగతించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా..? అక్టోబర్ 26న చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో సాయంత్రం 6 గంటల నుండి’ అంటూ వీడియో రిలీజ్ చేశారు. దీంతో సూర్య ఫ్యాన్స్ పండుగా చేసుకుంటున్నారు. కాగా.. ఈ ఈవెంట్‌కు వచ్చే స్పెషల్ గెస్ట్‌పై ఇంకా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వలేదు చిత్ర బృందం.