మాజీ బాయ్‌ఫ్రెండ్ టచ్‌లోనే ఉన్నాడు.. Janhvi Kapoor

by Hajipasha |   ( Updated:2022-07-28 10:42:00.0  )
Janhvi Kapoor Remembers her Ex-boyfriend Ishaan Khattars Friendship
X

దిశ, సినిమా: Janhvi Kapoor Remembers her Ex-boyfriend Ishaan Khattar's Friendship| బీ టౌన్ బ్యూటీ జాన్వీ‌కపూర్ మాజీ ప్రియుడు ఇషాన్ ఖట్టర్‌తో టచ్‌లో ఉన్నట్లు తెలిపింది. 2018లో వచ్చిన 'ధడక్' సినిమాతో అరంగేట్రం చేసిన వీరిద్దరూ కొంతకాలం డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఇష్యూపై తాజాగా స్పందించిన జాన్వీ.. తామిద్దరం ఒకప్పటిలా తరచుగా కలుసుకోనప్పటికీ ఒకరినొకరు హృదయపూర్వకంగా పలకరించుకుంటున్నట్లు తెలిపింది. అయితే అందరూ తమ స్నేహం ప్రత్యేకమైనదిగా భావిస్తున్నారనే విషయం తెలుసన్న నటి.. ఇప్పుడు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నట్లు చెప్పింది. ఇక తాము కలిసిన ప్రతిసారీ ఏదో తెలియని వెచ్చని శ్వాస తగిలినట్లు ఉంటుందన్న బ్యూటీ.. అప్పుడప్పుడూ మెసేజ్‌లు పంపుకుంటున్నట్లు వెల్లడించింది. ఇక తను నటించిన తాజా చిత్రం 'గుడ్‌లక్ జెర్రీ' జూలై 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది కూడా చదవండి: సినిమా రిలీజ్‌కు ముందు రవితేజకు గట్టి షాక్.. వీడియో లీక్

Advertisement

Next Story

Most Viewed