- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Janasena: నేడు అనంతపురానికి జనసేనాని.. కౌలు రైతులకు ఆర్థిక సాయం

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టాదారు భూములను సాగు చేస్తున్న వారిలో కౌలురైతులే అధికంగా ఉన్నారు. ఈ కౌలు రైతులు అప్పులు తెచ్చుకొని వ్యవసాయం చేస్తున్నా.. పండే పంటకు సరైన గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. దీనిపై జనసేనాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. కౌలు రైతులను ఆదుకోవడానికి తన సొంతంగా రూ.5 కోట్లు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో కౌలు రైతులకు నేనున్నానంటూ భరోసా కల్పిస్తూ మంగళవారం భరోసా యాత్ర ప్రారంభించి, కౌలు రైతులకు ఆర్థిక సాయం చేయనున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించి, ధైర్యం చెప్పనున్నారు. ఈ యాత్రను అనంతపురం జిల్లా నుంచి ప్రారంభించనున్నారు. అనంతరం రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని రైతులతో మాట్లాడనున్నారు.
Next Story