- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆకట్టుకుంటున్న జనసేన ఆవిర్భావ దినోత్సవ పాట
దిశ, వెబ్‌డెస్క్: జనసేన ఆవిర్భావ దినోత్సవానికి జనసైనికులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. గుంటూరు జిల్లా జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామ సమీపంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇప్పటికే సభ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. దామోదరం సంజీవయ్య చైతన్య వేదికగా సభకు నామకరణం చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. పోలీసుల అనుమతితో సభ నిర్వహించనున్నారు. ఈ ఆవిర్భావ దినోత్స ఏర్పాట్లన్నీ జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అయితే, ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకల కోసం జన సైనికులు ప్రత్యేకంగా ఓ పాటను రూపొందించారు. భీమ్లానాయక్‌లోని ''లాల్లా.. భీమ్లా'' పాట మాదిరి "జన జన జన జనసేనా" అంటూ సాగే ఈ స్పెషల్ సాంగ్ జనసైనికులను ఆకట్టుకుంటుంది. అంతేకాదు, ఆవిర్భావ సభ కోసం ప్రత్యేకంగా రూపొందించిన పోస్టర్‌పై "భవిష్యత్తు జెండాని మోయటంకంటే బాధ్యత ఏముంటుంది. ఒకతరం కోసం యుద్ధం చేయటంకంటే సాహసం ఏముంటుంది" అంటూ పార్టీ శ్రేణులకు పవన్ సందేశమిచ్చారు. దీనిని శుక్రవారం నాదెండ్ల మనోహర్ రిలీజ్ చేశారు.