అస్సాం సీఎం కి ఎంత మంది తండ్రులు..అని అడిగితే ఎలా ఉంటుంది: జగ్గారెడ్డి

by Disha News Desk |
అస్సాం సీఎం కి ఎంత మంది తండ్రులు..అని అడిగితే ఎలా ఉంటుంది: జగ్గారెడ్డి
X

దిశ ప్రతినిధి, సంగారెడ్డి: రాహుల్​గాంధీ తండ్రి ఎవరని మేము అడిగామా అంటూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ముర్ఖంగా మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడటం సరికాదు. మరి హిమంత్‌కు​ఎంత మంది తండ్రులు అని మేము అడిగితే ఎలా ఉంటుంది..? అని టీపీసీసీ వర్కింగ్​ప్రెసిడెంట్​తూర్పు జయప్రకాశ్​రెడ్డి(జగ్గారెడ్డి) సూటిగా ప్రశ్నించారు. సంగారెడ్డి లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాహుల్​పై హిమంత చేసిన వ్యాఖ్యలను జగ్గారెడ్డి తీవ్రంగా ఖండించారు. సీఎం హోదా‌లో వ్యక్తి ఇలా మాట్లడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం కోసం ఆస్తులు, ప్రాణాలను త్యాగం చేసిన రాహుల్ కుటుంబం గురించి మాట్లాడే అర్హత హిమంత కు ఉందా.. అని ప్రశ్నించారు.

స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మాగాంధీ‌తో కలిసి నెహ్రు పనిచేశారన్నారు. 16 ఏండ్లు జైల్లో ఉన్నారు. స్వర్గీయ ప్రధాని ఇందిరా గాంధీ చిన్నతనంలోనే స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా ఆరేండ్లు జైలులో ఉన్నారు. దేశం కోసం ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ బలిదానం అయ్యారని జగ్గారెడ్డి గుర్తు చేశారు. గాంధీ కుటుంబానికి ఘనమైన చరిత్ర ఉన్నదని, బీజేపీ ఎక్కడ ఉందో హిమంత చెబుతారా..?అని ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు నడ్డా స్వాతంత్ర్య ఉద్యమం తో సంబంధం ఉన్నవారు కాదన్నారు. వాజ్‌పేయ్, అద్వానీ మినహా బీజేపీలో ఇప్పుడున్న ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులకు స్వాతంత్ర ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.

ఎలాంటి చరిత్ర లేని బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ కుటుంబం గురించి ఎలా మాట్లాడతారని మండిపడ్డారు. అస్సాం సీఎం చదువుకున్న మూర్ఖుడిలా మాట్లాడుతున్నారని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హిమంత కు ఎందరు తండ్రులు..? అని కాంగ్రెస్ పార్టీ నేతలు అడిగితే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఇంత తెలివి లేని సీఎం ని బీజేపీ సమర్దిస్తుందంటే ఇంత మూర్ఖత్వం మరోటి ఉండదు. ఇలా మాట్లాడి బీజేపీ నాయకులు పరువు తీసుకోవద్దని జగ్గారెడ్డి హితవు పలికారు.

Advertisement

Next Story

Most Viewed