- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Jagdeep Dhankhar: మోడీ సమక్షంలో జగదీప్ ధన్కర్ నామినేషన్
న్యూఢిల్లీ: Jagdeep Dhankhar Files Nomination For Vice President Elections In PM Modi's Presence| ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్కర్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీల సమక్షంలో ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించారు. తన నామినేషన్ దాఖలు చేయడానికి ముందు, ధన్కర్ ఉపరాష్ట్రపతి పదవికి తన ప్రయత్నానికి మద్దతు ఇస్తున్న వివిధ పార్టీల ఎంపీల సమావేశానికి హాజరయ్యారు. బీజేపీ అగ్రనేతలతో పాటు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ, లోక్ జనశక్తి పార్టీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అంతకుముందు 71 ఏళ్ల దన్కర్ బెంగాల్ గవర్నర్‌గా ఉండగా, మమతా బెనర్జీ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యలా ఉంటూ అందరిని దృష్టిని ఆకర్షించారు. ఈ చర్యలతోనే అనుహ్యంగా బీజేపీ ఆయనకు రాజ్యాంగ బద్దమైన రెండో అత్యుత్తమ పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా ప్రకటించింది. ఇక, విపక్ష పార్టీల అభ్యర్థిగా ఆదివారం మాజీ కేంద్ర మంత్రి మార్గరెట్ అల్వాను ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మార్గరెట్ నామినేషన్ల చివరి రోజైన మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాగా, ఉపరాష్ట్రపతి ఎన్నిక ఆగస్టు 6న జరగనుంది.
ఇది కూడా చదవండి: గుజరాత్‌లో రోడ్డు మధ్యలో భారీ గొయ్యి.. వీడియో వైరల్
- Tags
- Jagdeep Dhankhar