- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ సమయంలో టెన్షన్‌తో చచ్చిపోతాననుకున్నా.. హాట్ బ్యూటీ
దిశ, సినిమా: కోవిడ్-19 మహమ్మారి సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలను సైతం ఉక్కిరిబిక్కిరి చేసింది. కరోనా సోకి ఎంతోమంది ప్రాణాలు కోల్పోగా మరికొందరిని మానసికంగా ఆందోళనకు గురి చేసింది. ఇందులో భాగంగానే శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా కొవిడ్ టైమ్‌లో మానసిక ధైర్యం కావాలంటూ ఇతరుల సహాయం కోరినట్లు తెలిపింది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ సినిమా 'బచ్చన్ పాండే'లో ఓ కీ రోల్ పోషిస్తున్న నటి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'కరోనా టైమ్‌లో ఎప్పుడూ ఏమి జరుగుతుందో తెలియక నెలరోజులు టెన్సన్‌తో చచ్చిపోయాను. ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా, భయంతో బతుకుతున్న నేను.. నగరంలో నాలాగే ఒంటరిగా ఎంతోమంది జీవిస్తున్నారని తెలిసి ధైర్యం తెచ్చుకున్న.
కుటుంబ సభ్యులున్నా ఎవరూ నా వల్ల ఇబ్బంది పడకూడదని వాళ్ళ హెల్ప్ తీసుకోవడానికి నిరాకరించాను. కానీ, మానసిక ధైర్యం కోసం ఎంతోమందిని సంప్రదించాను' అంటూ చెప్పుకొచ్చింది. అలాగే ఈ మహమ్మారి వల్ల ఎంతోమంది ఉపాధి కోల్పోవడమే కాకుండా తమ కుటుంబ సభ్యులను కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేసిన నటి.. ఆ సమయంలో కూడా వాళ్లు దృఢమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండటం చూసి ఆశ్చర్యం వేసిందని తెలిపింది.