- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tollywood: 'గేమ్ ఛేంజర్' రిలీజ్ రోజునే 'తండేల్' రాబోతోందా?
దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ ఇండస్ట్రీలో వచ్చే సంక్రాంతికి బిగ్ వారే జరగబోతుంది. ప్రతీ ఏడాది స్టార్ హీరోల సినిమాలు మూడు, నాలుగు పక్కా ఉంటాయి. అయితే, ఈ సారి కూడా గట్టి పోటీనే ఉండబోతుంది. మెగాస్టార్ తన కొడుకు రామ్ చరణ్ కోసం వెనక్కి తగ్గిన విషయం మనకీ తెలిసిందే.
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఇప్పుడు చరణ్ కు పోటీగా అక్కినేని హీరో దిగబోతున్నాడు. 'గేమ్ ఛేంజర్' విడుదల రోజునే చైతూ హీరోగా నటిస్తోన్న 'తండేల్' కూడా అదే రోజున రాబోతుందంటూ టాక్ బయటికొచ్చింది. 'తండేల్' మూవీ వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది.
'గేమ్ ఛేంజర్' మూవీని మూడేళ్ల నుంచి తీస్తూనే ఉన్నారు. అలాగే ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. కథపై నమ్మకంతోనే 'తండేల్' మూవీ టీమ్ వెనక్కి తగ్గడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా.. వచ్చే సంక్రాంతికి 'తండేల్' రిలీజ్ చేస్తారని బజ్ వినిపిస్తోంది.