- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చర్చనీయాంశంగా రణ్‌వీర్ సింగ్ న్యూడ్ ఫొటో షూట్
దిశ, ఫీచర్స్ : రెండు మూడు రోజుల నుంచి గూగుల్ ట్రెండ్స్‌లో బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రముఖ మ్యాగజైన్ కవర్ ఫొటో కోసం చేసిన న్యూడ్ షూట్‌తో అతను దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాడు. 1972లో కాస్మోపాలిటన్ మ్యాగజైన్ కోసం నగ్నంగా కనిపించిన అప్పటి పాప్ ఐకాన్ 'బర్ట్ రెనాల్డ్స్'కు ఈ ఫొటోషూట్ ఒక 'సౌందర్య నివాళి'.
కాగా ఇందుకు సిద్ధపడ్డ రణ్‌వీర్ కాన్ఫిడెన్స్, గట్స్‌ను అభిమానులతో పాటు అతడి కోస్టార్ట్స్ కూడా అభినందించారు. కానీ నెటిజన్ల నుంచి ట్రోల్స్, మీమ్స్ హోరెత్తుతుండటంతో సోషల్ మీడియా వ్యాప్తంగా ఈ టాపిక్‌పై వాదోపవాదాలు నడుస్తున్నాయి. వాస్తవానికి ఇండియాలో 'నగ్నత్వం' ఒక సంక్లిష్టమైన డొమైన్. పురాతన కాలం నుంచి నగ్న చిత్రాలు కళాకారులకు ప్రేరణగా ఉన్నాయి. అయితే న్యూడిటీలోనూ లింగవివక్ష ఉంటుందా? సమాజం ఏ కోణాన్ని యాక్సెప్ట్ చేస్తుంది? తరచూ అతివల ఆహార్యంపైనే ఎందుకు హేట్ కామెంట్స్ వినిపిస్తున్నాయి?
సమాజం నగ్నత్వాన్ని ఎలా ఎంచుకుంటుందనే విషయంలో చాలామందిలో చాలా సందేహాలున్నాయి. ఉదాహరణకు : మహిళలు టాప్‌లెస్‌గా కనిపించడం చాలా దేశాల్లో చట్టవిరుద్ధం. కానీ అదే చట్టం పురుషులకు వర్తించదు. ఇతర దేశాల సంగతి పక్కనపెడితే.. ఇండియాలో 'నగ్నత్వం' ఒక టిపికల్ టాపిక్. ఇది పురాతన దేవాలయాల్లోని శిల్పకళలో దైవిక స్త్రీ రూపంలో అంగీకరించబడుతుంది. అలాగే మేళాల్లో నగ్న పురుషుల గురించి చర్చిస్తుంది. కానీ 'స్కిన్ షో(చర్మాన్ని చూపిస్తే)' చేసే స్త్రీల విషయంలో మాత్రం ఆమోదయోగ్యం కాదు. మన సాంప్రదాయక వస్త్రధారణలు వెంటిలేషన్‌ను అనుమతించినప్పటికీ, నిరాడంబరంగా దుస్తులు ధరించడంపై ఎప్పుడూ ఓ సరిహద్దు రేఖ ఉండనే ఉంటుంది. ఎంతగా అంటే.. స్త్రీ శరీరం, నగ్నత్వంతో ముడిపడి ఉన్న ప్రతీ అంశంపై ఏ వ్యక్తి అయినా తన నోటికి వచ్చినట్లు మాట్లాడే స్వతంత్రం కలిగి ఉంటాడు. అది సభ్యత కాదంటూ దండోరా వేసేంత స్వేచ్ఛను పొంది ఉంటాడు. మరి మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక వ్యక్తి గురించే సర్వత్రా చర్చ నడుస్తోంది. కానీ ఇదే అంశంలో 'జెండర్' తారుమారైతే.. ఇదొక సెన్సేషనల్ కాంట్రవర్సీ ఇష్యూగా మారి ఎంతోమందికి ఆగ్రహం తెప్పించి ఉండేదని స్త్రీ వాదులు అభిప్రాయపడుతున్నారు.
ట్రోల్స్ మహిళలకే ఎందుకు?
'కామసూత్ర 3D' సెట్స్ నుంచి లీకైన షెర్లిన్ చోప్రా న్యూడ్ ఫొటో.. క్షణాల్లో ఇంటర్నెట్‌లో వ్యాపించడంతో ఆమెపై టన్నుల కొద్దీ 'హేట్' కామెంట్స్ వెలువడ్డాయి. ఇక 'పద్మావత్' చిత్రం విడుదల సమయంలో పద్మావతి పేరును 'పద్మావత్'గా మార్చిన తర్వాత, 'ఘూమర్' పాటలో దీపికా పదుకొణె మిడ్‌రిఫ్ VFX ద్వారా కవర్ చేయడం దేనికి సంకేతం? ఒక రాజ్‌పుత్ రాణి నృత్యం చేయడం.. ఆమె మిడ్‌రిఫ్‌ను చూపించడం అసభ్యకరమైందని అర్థమా? లేక మహిళలను అలా చూపించడం అశ్లీలమా? అన్నది సామాజిక వాదులు చెప్పాల్సిన సమాధానం. అంతేకాదు కియారా అద్వానీ 'లీఫ్ ఫొటో' షూట్‌పై వివాదం చెలరేగడంతో, ఆమె తన మెసేజెస్(DM) ఆఫ్ చేసుకుంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత వేసుకున్న ఓ డ్రెస్‌పై దారుణమైన ట్రోలింగ్ రావడంతో.. 'అలంకరించే హేమ్‌లైన్స్, నెక్‌లైన్స్ ఆధారంగా స్త్రీ వ్యక్తిత్వాన్ని జడ్జ్ చేయడం మానేసి, మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోవడంపై దృష్టిసారించండి' అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది సామ్. బుల్లితెర యాంకర్ అనసూయ సైతం దుస్తుల విషయంలో తరచూ ట్రోలింగ్‌కు గురవుతుండగా.. ఆమె ఘాటుగా రిప్లయ్ ఇచ్చిన సందర్భాలు బోలెడున్నాయి. అంతేకాదు ఈ వయసులో ఇలాంటి డ్రెస్సులు అవసరమా? అంటూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతిని అనేక మంది ప్రశ్నించారు. చివరకు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు కూడా మహిళల డ్రెస్సింగ్‌పై కామెంట్ చేయడం దురదృష్టకరం. ఇలా మహిళలను వారి దుస్తులు, జాతి, చదువు, సామాజిక స్థితి, రూపురేఖలు, స్కిన్ టోన్‌ను బట్టి అంచనా వేయడం సమంజసమేనా? అని మహిళా అభ్యుదయవాదులు విచారం వ్యక్తం చేశారు.
ఇతర నటీనటులు కూడా చేశారు
2020-గోవా బీచ్‌లో 'న్యూడ్ బర్త్‌డే రన్' కోసం ఇంటర్నెట్‌ను బ్రేక్ చేసిన మిలింద్ సోమన్ సహా ఈ 'ఫీట్'లో రణ్‌వీర్ కంటే ముందు ఎంతోమంది మేల్ యాక్టర్స్ ఉన్నారు. ప్రస్తుతం టాలీవుడ్ రౌడీ హీరో విజయ దేవరకొండ సైతం 'న్యూడ్ ఫొటో'తో ట్రెండింగ్‌లో నిలిచాడు. అమీర్ ఖాన్, జాన్ అబ్రహం, రాహుల్ ఖన్నా ఎప్పుడో ఈ జాబితాలో చేరారు. అయితే దుస్తులు నిండుగా ధరించని స్త్రీ శరీరం మాదిరి పురుషుని బేర్ బాడీ ఎందుకు బాధించదు? ఎందుకు స్త్రీ బట్టలు విప్పడం మాత్రమే మన నైతికత, సాంప్రదాయ విలువలను కించపరుస్తుంది? పురుషుడు అలా చేయడాన్ని బ్రేవరీ యాక్ట్‌గా లేదా ఓ కళగా ఎందుకు భావిస్తారు? మగ శరీరాన్ని గ్లోరిఫై చేసేందుకు, స్త్రీ శరీరాన్ని ఆబ్జెక్ట్ చేయడానికి మనం ఎందుకు తొందరపడుతున్నాం? నగ్నత్వంపై ప్రతిస్పందించే విషయంలో ఎందుకు బ్యాలన్స్ లేదు? సచిన్ టెండూల్కర్ అభిమాని సుధీర్ కుమార్ చౌదరి తన బాడీపై పెయింట్ వేసుకోవడాన్ని 'ఆటపై పిచ్చి' ప్రేమగా భావించినప్పుడు? భారతజట్టు విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు టాప్‌లెస్‌గా వెళ్తానన్న పూనమ్ పాండేది పిచ్చిపని ఎలా అవుతుంది? స్త్రీ నగ్నత్వాన్ని ఎప్పుడూ శృంగారభరితంగా చిత్రీకరించడం, అశ్లీలంగా వినియోగించడాన్ని సాధారణీకరించడమే ఇందుకు కారణం. సమతౌల్యం పాటించాల్సిన ఇలాంటి సున్నిత అంశాలపై మనకు మనం ఆత్మపరిశీలన చేసుకోవడమే తక్షణ కర్తవ్యం.
దేవుళ్లు, వీరులు, యోధులు లేదా పౌరాణిక జీవుల వేషధారణలో స్త్రీ, పురుషుల లింగ నిర్మిత నగ్న బొమ్మలు దేశంలోని చాలా ఆలయాల్లో కనిపిస్తాయి. అనేక న్యూడ్ పెయింటింగ్స్, స్త్రీ రూప శిల్పాలు ఈ రోజు లైంగికత, శక్తి గురించి నిర్మొహమాటంగా, నిస్సందేహంగా స్వీయ-అవగాహన కలిగి ఉన్నాయి. అవన్నీ ఆమె శరీరంపై యాజమాన్యాన్ని పేర్కొన్నవే. స్త్రీ శక్తి స్పష్టమైన స్వరూపం. ఇది కళ ప్రాముఖ్యతను సమర్థిస్తుంది. సృజనాత్మకతకు మూలమైన దీని నుంచే స్త్రీ దృష్టి నిర్వచించబడింది. అది పురుషుల చూపు నుంచి వేరుగా ఉంటుంది. అందువల్ల మేము ప్రతిరోజూ ఆబ్జెక్టిఫికేషన్‌తో పోరాడుతున్నాం.
- అంజోలీ మీనన్, కళాకారిణి
స్త్రీ శరీరం కచ్చితంగా మనోహరమైంది. కాబట్టి, ఇప్పుడు మీరు నగ్నత్వం లింగ పక్షపాతం అని చెప్పాలనుకుంటే దానికే కట్టుబడండి. పురుషులను ఎవరు చూడాలనుకుంటున్నారు? వారు నగ్నంగా ఉన్నప్పుడు చాలా అసభ్యంగా ఉంటారు! నగ్నత్వం మన దైనందిన జీవితంలో భాగం. అయితే ఏది ఒప్పు? ఏది తప్పు? నిర్ణయించడంలోనే మన సమయం వృథా చేస్తున్నామనే అర్థంలో ఇది మనకు భారీ కాంప్లెక్స్‌ను ఇచ్చింది. అలాగే నగ్నత్వం వంటి అంశంపై ఏదైనా ప్రదర్శించేటప్పుడు అసభ్యకరంగా లేకుండా సృజనాత్మకంగా ఉండటం చాలా ముఖ్యం. నగ్నత్వం అంగీకరించబడుతుంది.
- నఫీసా అలీ, యాక్ట్సెస్, సోషల్ వర్కర్