సినీ పరిశ్రమలో ఉండాలంటే మీరు ఇలానే ఉండాలి: Priyamani

by samatah |   ( Updated:2022-04-06 07:53:39.0  )
సినీ పరిశ్రమలో ఉండాలంటే మీరు ఇలానే ఉండాలి: Priyamani
X

దిశ వెబ్ డెస్క్ : నటి ప్రియమణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దక్షిణాది, హిందీ సినీ పరిశ్రమలో ఎన్నో మంచి పాత్రలతో అభిమానుల మనసు దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక పెళ్లైన కొత్తలో సినిమాతో తెలుగు అభిమానుల్లో మంచి క్రేజ్ సంపాదించుకంది. అలాగే ఈ అమ్మడు తన మనసులోని మాటలను చెప్పడంలో ఎప్పుడూ ముందుంటుంది. కాగా, ఓ ఇంటర్వూలో ప్రియమణి మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీలో రాణించాలంటే ట్యాలెంట్‌తో పాటు, మంచి అందం, స్కిన్ టోన్, ఆకట్టుకునే దుస్తులు, మంచి హేయిర్ స్టైల్ కలిగి ఉండాలని పేర్కొంది. అలాగే ఒక సెలబ్రెటీగా బయటకు రావడమే ఆలస్యం ప్రతి ఒక్కరి చూపు వారిపైనే ఉంటుందని, ఫోన్‌లో, కెమెరాల్లో తమను బంధిస్తుంటారని పేర్కొంది. అదే విధంగా హీరోయిన్స్ ధరించే దుస్తులపై విమర్శలు తగ్గించాలని పేర్కొంది. అలాంటి దుస్తులు కేవలం షోలో అరగంట మాత్రమే ధరిస్తుంటారని ప్రజలు దీన్ని తెలుసుకోవాలని తెలిపింది.

Next Story

Most Viewed