బ్రాడ్ బాండ్ సేవా పోర్టల్ ప్రారంభించిన అనురాగ్ ఠాకూర్

by Manoj |
బ్రాడ్ బాండ్ సేవా పోర్టల్ ప్రారంభించిన అనురాగ్ ఠాకూర్
X

న్యూఢిల్లీ: కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సరికొత్త సేవలను ప్రారంభించారు. సోమవారం దేశ రాజధానిలో మంత్రిత్వ శాఖకు సంబంధించిన బ్రాడ్ కాస్ట్ సేవా పోర్టల్ ను ఆయన ఆవిష్కరించారు. మీడియా, వినోద రంగం నిరంతరం వృద్ధి చెందుతుందని అనురాగ్ ఠాకూర్ అన్నారు. పర్యావరణ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారితనం తీసుకువస్తుందని చెప్పారు.

బ్రాడ్‌కాస్ట్ సేవా పోర్టల్ అప్లికేషన్‌ల టర్న్ అరౌండ్ సమయాన్ని తగ్గిస్తూ.. అదే సమయంలో పురోగతిని ట్రాక్ చేయడానికి దరఖాస్తుదారులకు సహాయపడుతుందని వెల్లడించారు. రాబోయే రెండేళ్లలో 25 బిలియన్ యూఎస్ డాలర్లుగా ఉన్న ఇండస్ట్రీ, 30 బిలియన్ యూఎస్ డాలర్లకు చేరుతుందని తెలిపారు. ప్రస్తుతం దేశంలో 900 శాటిలైట్ టీవీ చానెళ్లు, 1762 మల్టీ సర్వీస్ అపరేటర్స్, 350 కమ్యూనిటీ రేడియో స్టేషన్లు, 380కి పైగా ఎఫ్ఎం ఛానెళ్లు ఉన్నాయని చెప్పారు. తాజా పోర్టల్ ప్రారంభం ప్రధాని మోడీ కనిష్ట ప్రభుత్వం-గరిష్ట పాలనను గ్రహించడంలో ఒక పెద్ద ముందడుగు అని అన్నారు.

Advertisement

Next Story