- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎస్‌యూవీ మోడల్స్ కు మార్కెట్లో భారీ గిరాకీ.!
న్యూఢిల్లీ: భారత వాహన పరిశ్రమలో ఎస్‌యూవీల వాటా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. వినియోగదారుల నుంచి పెరుగుతున్న ఆదరణకు తగినట్టుగానే వాహన తయారీ కంపెనీలు సైతం భారీ సంఖ్యలో ఎస్‌యూవీ మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. గత ఐదేళ్ల కాలంలో భారత కార్ల కంపెనీలు 36 మోడళ్లను విడుదల చేశాయి. ప్రస్తుతం ఎస్‌యూవీలకు భారీ గిరాకీ ఉంది. సౌకర్యంతో పాటు మెరుగైన టెక్నాలజీ ప్రయోజనాలు, భద్రత లాంటి అంశాల కారణంగా వినియోగదారులు పెద్ద వాహనాలకు మారుతున్నారు. కంపెనీలు చెబుతున్న దాని ప్రకారం, ఎక్కువ ఆదరణ ఉన్న మోడళ్ల కోసం కస్టమర్లు రెండేళ్లకు పైగా వెయిట్ చేసి మరీ కొనేందుకు సిద్ధపడుతున్నారు. ఇంకా కొత్త కొత్త ఆర్డర్లు సైతం అదే స్థాయిలో కొనసాగుతుండటం విశేషం.
వినియోగదారులు గతంలో కంటే గత కొన్నేళ్లలో వ్యక్తిగత వాహనాలకు ఎక్కువ ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కనెక్టెడ్ టెక్నాలజీ లాంటి ఫీచర్లు ఉన్న టాప్-ఎండ్ వేరియంట్లను వినియోగదారులు ఇష్టపడుతున్నారు. కార్ల అమ్మకాల్లో కొన్నాళ్ల వరకు హ్యాచ్‌బ్యాక్ మోడళ్లకు విపరీతమైన ఆదరణ ఉండేది, ఆ తర్వాత ఫీచర్లు, భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలు ఎంట్రీ-లెవల్ నుంచి మిడ్-సైజ్ ఎస్‌యూవీలకు మారుతున్నారు. ఈ కారణంగానే ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో కంపెనీలు ఎక్కువ కార్లను తీసుకొస్తున్నాయి. గత కొన్నేళ్లలో ఎస్‌యూవీ సెగ్మెంట్ దాదాపు 19 శాతాం వాటా నుంచి 40 శాతానికి పెరిగింది. భవిష్యత్తులో మరింత పెరుగుతుందని మారుతీ సుజుకి ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ చెప్పారు.