- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
స్టార్టప్‌లకు నిధుల ప్రవాహం.. మూడు నెలల్లో 200 శాతం వృద్ధి!
న్యూఢిల్లీ: దేశీయ స్టార్టప్ కంపెనీలు ప్రస్తుత ఏడాది మొదటి మూడు నెలల్లో 12 బిలియన్ డాలర్ల(రూ. 91.14 వేల కోట్ల)కు పైగా నిధులను సాధించాయని ఓ నివేదిక వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలంలో 4 బిలియన్ డాలర్ల(రూ. 30 వేల కోట్ల)తో పోలిస్తే ఇది 200 శాతం వృద్ధి కావడం విశేషం. ప్రముఖ డేటా ట్రాకింగ్ ప్లాట్‌ఫామ్ ఫిన్‌ట్రాకర్ నివేదిక ప్రకారం.. సమీక్షించిన కాలంలో మొత్తం 528 స్టార్టప్‌లు రూ. 91 వేల కోట్లకు పైగా నిధుల సమీకరణను అనుసరించాయి. ఈ మొత్తం స్టార్టప్‌లలో 324 కంపెనీలు ప్రారంభ దశలో ఉండగా, 123 కంపెనీలు వృద్ధి చెందుతున్న దశలో ఉన్నాయి.
అలాగే, ఇప్పటివరకు భారత్‌లో మొత్తం 82 యూనికార్న్‌లు ఉన్నాయని, ఇవి 2014 నుంచి 2021, డిసెంబర్ నాటికి 38.4 బిలియన్ డాలర్ల(రూ. 2.91 లక్షల కోట్ల) విలువైన నిధులను సమీకరించాయి. ఇటీవల హురున్ రీసెర్చ్ ప్రకారం.. అమెరికా, చైనా తర్వాత భారత్ ఈ ఏడాది మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్‌గా అవతరించింది. ఈ క్రమంలో ఈ ఏడాది భారత్ 100 యూనికార్న్ కంపెనీల మైలురాయిని అధిగమిస్తుందని నివేదిక అంచనా వేసింది. ఇక, గత ఐదేళ్లలో భారత్‌లోని సాఫ్ట్‌వేర్-యాజ్-ఏ-సర్వీస్(సాస్) కంపెనీల సంఖ్య రెట్టింపు అయ్యాయని, ఇవి 2025 నాటికి 30 బిలియన్ డాలర్ల(రూ. 2.27 లక్షల కోట్ల) ఆదాయాన్ని చేరుకుంటాయని నివేదిక వెల్లడించింది.