భారతీయ ఉద్యమకారుడు 'చంద్రశేఖర్ ఆజాద్' జయంతి..

by Manoj |
భారతీయ ఉద్యమకారుడు చంద్రశేఖర్ ఆజాద్ జయంతి..
X

దిశ, ఫీచర్స్: భారతీయ ఉద్యమకారుడు చంద్రశేఖర్ సీతారాం తివారీ (చంద్రశేఖర్ ఆజాద్) 1906 జూలై 23న జన్మించాడు. దేశం గర్వించదగ్గ ఉద్యమకారుల్లో ఒకడైన ఆయన.. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్, పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, ప్రేమ్ కిషన్ ఖన్నా, అష్ఫాకుల్లా ఖాన్‌ల సహచరుడు. పదమూడో ఏట ఇల్లొదిలి ముంబై పారిపోయిన ఆజాద్.. కొంతకాలం అక్కడే మురికి వాడలో నివసిస్తూ కూలీ పనులు చేస్తూ అనేక కష్టాలు పడ్డాడు. అదే సమయంలో భారత స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ చేస్తున్న సహాయ నిరాకరణోద్యమంతో దేశం అట్టుడుకుతున్నది. తనవంతు పాత్ర పోషించాలనే ఆకాంక్షతో స్నేహితుడు రాంప్రసాద్ బిస్మిల్‌‌తో విప్లవ బాట పట్టాడు.

ఆ తర్వాత 1928 సెప్టెంబరులో భగత్ సింగ్, సుఖ్ దేవ్ మొదలగువారితో కలిసి 'హిందూస్థాన్ సోషలిస్టు రిపబ్లిక్ అసోసియేషన్' సంస్థను స్థాపించి బ్రిటీష్ ప్రభుత్వంపై యుద్ధానికి నాంది పలికారు. ఈ క్రమంలోనే బ్రిటీష్ అధికారి 'సాండర్స్'ను చంపి స్వాతంత్య్రం కోసం సర్వసమర్పణకు సంసిద్ధమైన ఆయనను.. 1931 ఫిబ్రవరి 27న అలహాబాద్‌లోని 'ఆల్‌ఫ్రెడ్ పార్క్‌'లో ఓ చెట్టుకింద ఆంగ్లేయుల రక్షకులు చుట్టుముట్టారు. దీంతో 'నా చావు నా చేతుల్లోనే ఉంది, శత్రువుల చేతుల్లో చావను' అని శపథం చేస్తూ తన రివాల్వర్‌తో తానే పేల్చుకుని ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడైనాడు.

Advertisement

Next Story

Most Viewed