సముద్ర రక్షణలో అప్రమత్తంగా భారత నౌకాదళం: రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్

by Web Desk |
సముద్ర రక్షణలో అప్రమత్తంగా భారత నౌకాదళం: రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్
X

న్యూఢిల్లీ: సముద్ర రక్షణలో భారత్ ప్రాధాన్యత కలిగిన భద్రతా భాగస్వామిగా, తక్షణమే స్పందిస్తూ కీలకంగా మారిందని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అన్నారు. హిందూ మహాసముద్ర రక్షణలో భారత నావికా దళం అప్రమత్తంగా ఉన్నారని చెప్పారు. దేశ 12వ రాష్ట్రపతి ఫ్లీట్ సమీక్షలో భాగంగా నేవీ, కోస్ట్‌గార్డ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన 60కి పైగా నౌకలు, జలాంతర్గాములను సోమవారం ఆయన పరిశీలించారు.

'హిందూ మహా సముద్రం గుండా పెద్ద ఎత్తున వాణిజ్యం జరుగుతుంది. మన వాణిజ్య, శక్తి అవసరాలు తీర్చడంలో సముద్రాల ద్వారానే సాగుతుంది. సముద్రాల భద్రత, పరిస్థితులు దృష్ట్యా రవాణా కీలకంగా మారింది. భారత నావీ నిరంతర పర్యవేక్షణ, తక్షణ స్పందన సముద్ర రవాణాను ఎక్కువగా విజయవంతం చేస్తుంది' అని చెప్పారు. భారత నావీ దళాలను సమీక్షించడం తనకు సంతోషంగా ఉందని చెప్పారు. నావీలో విశాఖపట్నం ముఖ్యమైన పాత్రను పోషిస్తుందన్నారు. ఆర్థిక వ్యవస్థ, పరిశ్రమల కేంద్రం గా ఉందని తెలిపారు.

1971 యుద్ధంలో విజయవంతమైన పాత్రను పోషించినట్లు చెప్పారు. ఈ మధ్యనే 50వ వార్షికోత్సవ వేడుకులను నిర్వహించినట్లు తెలిపారు. సముద్రాల వెంబడి భద్రతను దేశం విశ్వసిస్తుందని అన్నారు. చాలా వరకు యుద్ధనౌకలు, జలాంతర్గాములు దేశీయంగానే తయారైనట్లు చెప్పారు. ఇది ఎంతో గర్వించదగ్గ విషయమని తెలిపారు. ప్రతి రాష్ట్రపతి పదవీకాలంలో ఒకసారి నౌక సమీక్ష నిర్వహించబడుతుంది. గతంలో ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి గా ఉన్న సమయంలో 2016 లో నిర్వహించారు.

Advertisement

Next Story