- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kiran Abbavaram: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘క’.. 4 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
దిశ, సినిమా: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) లెటెస్ట్ మూవీ ‘క’ (Kaa). విలేజ్ (village) బ్యాక్‌డ్రాప్ (backdrop)లో డైరెక్టర్స్ సుజీత్ (Sujeet), సందీప్ (Sandeep) తెరకెక్కించిన ఈ చిత్రం దీపావళి (Diwali) స్పెషల్‌గా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ (Super Hit) సక్సెస్ అందుకుంది. దీంతో ఎక్కడ చూసినా హౌస్ ఫుల్, టికెట్స్ డిమాండ్‌తో టాక్ ఆఫ్ ది టౌన్ (Talk of the Town) అయ్యింది. ఈ క్రమంలోనే కలెక్షన్స్‌లో దూసుకుపోతూ.. బాక్సాఫీస్ (box office) వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ మేరకు ‘క’ సినిమాకు నాలుగు రోజుల్లో రూ. 26.52 కోట్లు వసూళ్లు రావడంతో ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.
ఈ విషయాన్ని చిత్ర బృందం అఫీషియల్ (Official)గా అనౌన్స్ చేస్తూ.. పోస్టర్ రిలీజ్ చేశారు. కాగా.. ఈ మూవీ దీవాళి విన్నర్ (winner) గా స్ఫష్టమైన ఆధిక్యత చూపిస్తోంది. ఇక 5వ రోజు కూడా ‘క’ సినిమా జోరు చూస్తుంటే.. ఈ కలెక్షన్స్ (Collections) మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు ట్రేడ్ వర్గాలు. ఇక ఈ మూవీలో తన్వీరామ్ (Tanveeram), నయన్ సారిక (Nayan Sarika) హీరోయిన్స్‌గా నటించగా.. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్‌మెంట్స్‌తో బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో నిర్మించారు. తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి రిలీజ్ చేశారు.
Read more ...
KA Movie : గొప్ప మనసు చాటుకున్న కిరణ్ అబ్బవరం.. అంధ విద్యార్థుల కోసం ఏం చేశారంటే..?