పాకిస్తాన్ కొత్త ప్రధాని ఫిక్స్.. మొదటి ప్రధానిగా ఇమ్రాన్

by Javid Pasha |
పాకిస్తాన్ కొత్త ప్రధాని ఫిక్స్.. మొదటి ప్రధానిగా ఇమ్రాన్
X

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్‌లోని రాజకీయ సంక్షోభం తారాస్థాయికి చేరింది. ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలు సైతం అవిశ్వాస తీర్మానానికి రెడీ అయ్యారు. దీంతో ఇమ్రాన్ ముందస్తు ఎన్నికలను ప్రకటించారు. రాబోయో 90 రోజుల్లో దేశంలో ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. అనంతరం ప్రధాని పదవి నుంచి ఇమ్రాన్ తప్పుకున్నాడు. ప్రస్తుతం పాకిస్తాన్‌కు కొత్త ప్రధాని ఫిక్స్ అయిపోయారు. ప్రతిపక్ష పార్టీ నేత షెహ్‌బాజ్ షరీఫ్‌ను పాకిస్తాన్ నెక్స్ట్ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవి నుంచి ఆదివారం తప్పుకున్నప్పటి నుంచి షరీఫ్ దేశ ప్రధానికగా నియమితులయ్యారు. షరీఫ్ ప్రతిపక్ష పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ (పీఎంఎల్ఎన్) పార్టీ అధ్యక్షుడు. ఈ సందర్బంగా పార్టీ నేతలు మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో జరిగిన అవిశ్వాస తీర్మానంలో ఓటమిని చవిచూసిన మొట్టమొదటి ప్రధాని ఇమ్రాన్ అని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed