Amit Shah: దేశాభివృద్ధి కోసం పటిష్టమైన సైబర్ సెక్యూరిటీ: అమిత్ షా

by Harish |   ( Updated:2022-06-20 10:59:31.0  )
Amit Shah Says, India Cant Develop Without Strong Cyber Security
X

న్యూఢిల్లీ: Amit Shah Says, India Can't Develop Without Strong Cyber Security| కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. పటిష్టమైన సైబర్ సెక్యూరిటీ లేకుండా భారతదేశం అభివృద్ధి చెందదని హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశ అభివృద్ధిలో ఇది చాలా ముఖ్యమైనదని చెప్పారు. సోమవారం ఢిల్లీలో సైబర్ రక్షణ, జాతీయ భద్రత అనే అంశంపై జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో భారతదేశం అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతోందని అన్నారు. సాంకేతిక వినియోగం అన్ని స్థాయిలకు చేరుకుందని అమిత్ షా పేర్కొన్నారు. ప్రతి భారతీయుడు సాంకేతికత, ఇంటర్నెట్ ద్వారా తమను తాము శక్తివంతం చేసుకోవాలనేది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజన్ అని తెలిపారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం వల్ల మన జీవితాల్లో సాధికారత, సానుకూల మార్పులు చోటు చేసుకున్నాయని వెల్లడించారు. అయితే వేగంగా పెరుగుతున్న సైబర్ నేరాలు సవాలుగా మారాయని అన్నారు. వాటిని అరికట్టడానికి తగిన కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. రాబోయే కాలంలో ప్రపంచంలోనే అత్యంత సైబర్ భద్రత ఉన్న దేశంగా భారత్ నిలుస్తుందని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed