- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
14వ స్థానంలో IIT Hyderabad.. ర్యాంకులు విడుదల చేసిన కేంద్రం
దిశ, డైనమిక్ బ్యూరో: IIT Hyderabad ranks 14 in NIRF list| దేశంలోని అత్యుత్తమ ప్రమాణాలు చూపిస్తున్న విద్యాసంస్థల వివరాలను కేంద్రం శుక్రవారం వెల్లడించింది. ఉన్నత విద్యా సంస్థలు, 2022 ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల వివరాలను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఢిల్లీలో విడుదల చేశారు. 2022 ఉన్నత విద్యాసంస్థల జాబితాలో దేశంలోనే 14వ స్థానంలో ఐఐటీ హైదరాబాద్, 20వ స్థానంలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, 45వ స్థానంలో వరంగల్ నిట్, 46వ స్థానంలో ఉస్మానియా యూనివర్సిటీలు నిలిచాయి. నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్‌ను ఎన్ఐఆర్ఎఫ్‌గా చెబుతారు.
ఇందులో ఐఐటీ మద్రాస్ వరుసగా నాలుగో ఏడాది మొదటి ర్యాంకును సొంతం చేసుకుంది. రెండు, మూడో స్థానాల్లో ఐఐఎస్ సీ బెంగళూరు, ఐఐటీ బాంబే ఉన్నాయి. గతేడాది ర్యాంకులతో పోల్చి చూస్తే, ఈ ఏడాది మొదటి మూడు స్థానాల్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు. అవే విద్యా సంస్థలు కొనసాగాయి. దేశవ్యాప్తంగా 45,000 డిగ్రీ కాలేజీలు, 1,000 యూనివర్సిటీలు, 1,500 ప్రముఖ విద్యా సంస్థలు ఉన్నాయి. వీటిల్లో 2021లో 6,000 సంస్థలే ర్యాంకుల్లో పాల్గొన్నాయి. 2022 ర్యాంకుల కోసం 7,254 విద్యా సంస్థలు పోటీ పడినట్లు తెలిపారు
ఇది కూడా చదవండి: Basara IIIT లో టెన్షన్ టెన్షన్.. 300 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత..
- Tags
- IIT Hyderabad