- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Jagga Reddy: నా కోరిక నెరవేరింది.. మేమంతా కలిసికట్టుగా పనిచేస్తాం
దిశ ప్రతినిధి,సంగారెడ్డి: 'నా కోరిక నెరవేరింది. యువనేత రాహుల్ గాంధీని నా కుటుంబ సభ్యులతో కలిశాను. ఆయన ఎంతో ఆత్మీయంగా పలకరించారు. పిల్లలు ఏం చదువుతున్నారని అడిగారు' అని కాంగ్రెస్ నేత, సంగారెడ్ది ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసిన జగ్గారెడ్డి "దిశ" ప్రతినిధితో మాట్లాడారు. తన కుటుంబ సభ్యులతో కలిసి రాహుల్ గాంధీని కలవాలని అనుకున్నానని, అది ఈరోజు కుదిరిందని ఆయన అన్నారు. తన కోరిక నెరవేరింది అని ఎనలేని సంతోషం వ్యక్తం చేశారు. రాజకీయాల కంటే ముందు తమ పిల్లల చదువుల గురించి రాహుల్ గాంధీ ఆరా తీయడం సంతోషంగా అనిపించిందని ఆయన చెప్పారు. బీజేపీ, ఎంఐఎం పార్టీలు మత విద్వేషాలతో రాజకీయం చేస్తున్నాయని, టీఆర్ఎస్ పార్టీతో పాటు మొత్తం ఈ మూడు పార్టీలకు వ్యతిరేకంగా పనిచేస్తామని జగ్గారెడ్డి చెప్పారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా కలిసికట్టుగా పనిచేసి, ప్రజా సమస్యలపై పోరాటం సాగిస్తామన్నారు. రాహుల్ గాంధీ ముందు తాను ఏ అంశాన్ని ఎత్తలేదనీ, అన్నీ మర్చిపోయానని ఆయన తెలిపారు. అయితే కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ముందుకెళతామని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. అంతేకాకుండా మనం, మన కుటుంబం అంటే, ప్రజలు, దేశం అన్నట్టుగా మేమంతా కలసికట్టుగా పనిచేస్తామని, బహిరంగ విమర్శలు ఇకపై ఉండవని జగ్గారెడ్డి వెల్లడించారు. పార్టీలో ఇప్పుడు సమస్యలే లేవని, ఇప్పటికే పార్టీ నేతలు కేసీ వేణుగోపాల్, మాణిక్యం ఠాగూర్‌లను కూడా కలిసి పార్టీ అంశాలపై చర్చించామని జగ్గారెడ్డి చెప్పారు.