- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Samantha: ‘అమ్మ అవ్వాలని ఉంది’.. సమంత కీలక వ్యాఖ్యలు.. రెండో పెళ్లి చేసుకోబోతోందా..?
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ‘ఏమాయ చేసావే’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఈ మూవీలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడింది. అలా కొన్నేళ్లు ప్రేమించుకున్న వీరు పెద్దల నొప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ, మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారు. విడాకుల తర్వాత నాగచైతన్య రీసెంట్‌గా స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళతో ఎంగేజ్‌మెంట్ చేసుకొని రెండో పెళ్లికి రెడీ అయ్యాడు. సమంత మాత్రం విడాకుల తర్వాత మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. హెల్త్ పై ఫోకస్ పెట్టింది. కాగా తాజాగా ‘సిటాడెల్: హనీ బన్నీ’ అనే వెబ్ సిరీస్‌తో మన ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ సిరీస్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత ‘సిటాడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్‌లో తాను పోషించిన మదర్ క్యారెక్టర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆమె మాట్లాడుతూ.. “నాకు తల్లి కావాలనే కలలు ఉన్నాయి. అమ్మగా ఉండటానికి ఇష్టపడతాను. ఇందుకు ఆలస్యమైందని నేను అనుకోవట్లేదు. ప్రస్తుతం నేను జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను అని సామ్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. సమంత రెండో పెళ్లి చేసుకోబోతోందా..? అందుకే ఇలా కామెంట్స్ చేసిందా అంటూ నెటిజన్లు పలు విధాలుగా చర్చించుకుంటున్నారు.
Read More : నాగచైతన్యతో పెళ్లి.. నా ఫస్ట్ లవర్ స్టుపిడ్ అంటూ శోభిత ధూళిపాళ ఆసక్తికర కామెంట్స్!