- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Trisha: ఆ స్టార్ హీరోని గుడ్డిగా నమ్మి అలా చేశాను- త్రిష సంచలన కామెంట్స్
దిశ, సినిమా: అలనాటి స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నది. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. కానీ సడెన్‌గా ఏమైందో ఏమో కానీ సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. మళ్లీ దాదాపు కొన్నేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చింది. సాధారణంగా హీరోయిన్స్ అప్పట్లో మంచి డైట్ మైంటెన్ చేస్తూ స్లిమ్‌గా నాజుగ్గా అందంగా ఉండేవారు. రాను రాను కాలంలో చాలా ఘోరంగా మారిపోయేవారు. కానీ ఈ బ్యూటీ రీ ఎంట్రీ తర్వాతనే మరింత గ్లామరస్‌గా అయింది. 40 ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోయిన్స్‌కు గట్టి పోటీ ఇస్తుంది. నిజం చెప్పాలంటే అప్పటి కంటే ఇప్పడే సూపర్ అనేంత మారిపోయింది ఈ ముద్దుగుమ్మ.
ఇక త్రిష సినిమాల విషయానికి వస్తే.. ‘లియో’ సినిమా సక్సెస్‌తో త్రిష డిమాండ్ భారీగా పెరిగిపోయిందనే చెప్పాలి. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ బిజీ అయిపోయింది ఈ బ్యూటీ. సౌత్ స్టార్ హీరోలుగా వెలుగు వెలుగుతున్న చిరంజీవి, విజయ్, అజిత్, కమల్ హాసన్, మోహన్ లాల్ వంటి అగ్ర హీరోల సినిమాల్లో నటిస్తూ బిజీగా మారారు త్రిష. అలాగే ఈ భామ వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఆమె ఓ బిజినెస్ మ్యాన్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంది. నిశ్చితార్థం వరకు వెళ్లిన వీరి పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది. అప్పటి నుంచి త్రిష సింగిల్‌గానే ఉంటోంది. అయితే తమిళ స్టార్ హీరో విజయ్, హీరోయిన్ త్రిష రిలేషన్‌లో ఉన్నారంటూ పలు పుకార్లు షికార్లు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో త్రిష చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిష.. స్టార్ హీరో విజయ్ పేరును ప్రస్తావించారు. ఆమె మాట్లాడుతూ.. నేను విజయ్‌తో ఓ సినిమాలో నటిస్తోన్న సమయంలో ఫైటింగ్ సీన్ చేయాల్సి వచ్చింది. అప్పటికే నా నడుముకు రోప్ కట్టారు. అయినప్పటికీ చాలా భయం వేసింది. దీంతో ఏం చేయాలో తెలియక విజయ్‌ను గుడ్డిగా నమ్మి అతనితో పాటు పై నుంచి దూకేశాను అని త్రిష చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.