Love Reddy : ‘లవ్ రెడ్డి’ ట్రైలర్ ఎలా ఉందంటే?

by Prasanna |   ( Updated:2024-10-16 15:57:07.0  )
Love Reddy : ‘లవ్ రెడ్డి’ ట్రైలర్ ఎలా ఉందంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : అంజన్ రామచంద్ర, శ్రావణి జంటగా తెరకెక్కిన మూవీ లవ్ రెడ్డి. గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ పతాకం పై సునంద బి.రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జి, మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి నిర్మాణంలో స్మరన్ రెడ్డి డైరెక్షన్ లో ఈ లవ్ రెడ్డి మూవీ రూపొందుతుంది. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఓ కొత్త ప్రేకథతో ఈ మూవీ రాబోతుంది.

తాజాగా, లవ్ రెడ్డి మూవీ ట్రైలర్ నిర్మాత SKN చేతుల మీదుగా విడుదల చేసారు. కర్ణాటక – ఆంద్ర బోర్డర్ రాయలసీమలోని ఓ గ్రామంలో జరిగే లవ్ స్టోరీ తో ఈ మూవీని తెరకెక్కించారు.

ట్రైలర్ లాంచ్ తర్వాత నిర్మాత SKN మాట్లాడుతూ.. " సినిమా ట్రైలర్ చాలా బాగుంది. 20 మంది కొత్తవాళ్లు సినీ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు.. వారందరికీ ఆల్ ది బెస్ట్ " అంటూ ఆయన మాటల్లో చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమా మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా అక్టోబర్ 18న థియేటర్లలో సందడీ చేయనుంది.

Advertisement

Next Story

Most Viewed