- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హాట్సాఫ్ రైల్వే పోలీసులు..
దిశ, గద్వాల్ క్రైమ్ : ఓ ప్రయాణికురాలు బంగారు ఆభరణాలు, నగదు ఉన్న బ్యాగును గద్వాల్ రైల్వే స్టేషన్ లో మరచి పోయింది. అయితే ఈ బ్యాగును గద్వాల్ రైల్వే పోలీసులు..ఆమె కుటుంబ సభ్యులకు అందజేసి మానవత్వం చాటుకున్నారు. గద్వాల్ రైల్వే హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో చెన్నైకి చెందిన ఆమంగ అనే ప్రయాణికురాలు గద్వాల నుంచి హైదరాబాద్ కు వెళ్లేందుకు స్టేషన్ కు వచ్చింది. ఆమె తన బ్యాగ్ ను ఒకటో నెంబర్ ప్లాట్ ఫామ్ పై ఉన్న బెంచీలో వదిలేసి రైలు ఎక్కేసింది.
బ్యాగులో ఉన్న సెల్ ఫోన్ ఆధారంగా గద్వాల్ లో ఉంటున్న తన బంధువులకు రైల్వే పోలీసులు సమాచారం అందించారు. ఈ క్రమంలో గద్వాల్‌కు చెందిన ఉదయ్ కుమార్ రైల్వే స్టేషన్ కు రావడంతో వివరాలు తెలుసుకొని, బ్యాగులో ఉన్న 10 తులాల బంగారు ఆభరణాలు, రూ.30 వేల నగదును, ఇతర వస్తువులతో పాటు బ్యాగును స్టేషన్ మాస్టర్ సమక్షంలో అందజేశారు. అనంతరం మానవత్వం చాటుకున్న రైల్వే పోలీసులను పలువురు అభినందించారు.