శుభవార్త చెప్పిన 'బుజ్జిగాడు' హీరోయిన్

by Web Desk |
శుభవార్త చెప్పిన బుజ్జిగాడు హీరోయిన్
X

దిశ, వెబ్‌డెస్క్: తాను త్వరలోనే తల్లి కాబోతున్నట్లు హీరోయిన్ సంజనా గల్రానీ తెలిపింది. ఈ మేరకు ఓ తాజా వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. ఆమె బేబీ బంప్‌‌లో జరుగుతున్న మార్పులను ప్రతి ఒక్క బిట్‌ను ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. సంజనా తన యోగా టీచర్‌తో బేబీ బంప్‌ని చూసి ఆచర్యపడుతున్న వీడియోను షేర్ చేసింది. దానికి "నా ప్రినేటల్ యోగా టీచర్ #tannybhattacharjee" అని క్యాప్షన్ కూడా ఇచ్చింది.

బుజ్జిగాడు, సర్దార్ గబ్బర్ సింగ్‌తో సహా పలు తెలుగు చిత్రాలలో సంజనా కనిపించింది. మాజీ బిగ్ బాస్ కన్నడ కంటెస్టెంట్‌ డాక్టర్ అజీజ్ పాషాను 2020లో వారి కుటుంబ సభ్యుల సమక్షంలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఈ జంట తమ పెళ్లిని చాలా గ్ర్యాండ్‌గా చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ మహమ్మారి కారణంగా చాల సంపుల్‌గా చేసుకొవాల్సి వచ్చింది. కాగా పెళ్లి కోసం ఆమె ఆదా చేసిన డబ్బును కన్నడ చిత్ర పరిశ్రమ కోసం విరాళంగా ఇచ్చేసంది.

Advertisement

Next Story

Most Viewed