- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Veekshanam: కామన్ మేన్ డిటెక్టివ్‌లా మారితే ఏం జరుగుతుంది.. హీరో రామ్ ఆసక్తికర కామెంట్స్
దిశ, సినిమా: రామ్ కార్తీక్ (Ram Karthik), కశ్వి (Kashvi) జంటగా నటిస్తున్న సినిమా ‘వీక్షణం’ (Veekshanam). కామెడీ మిస్టరీ థ్రిల్లర్ కథతో డైరెక్టర్ మనోజ్ పల్లేటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మీడియాతో ముచ్చటించాడు యంగ్ హీరో రామ్ కార్తీక్ (Ram Karthik).
‘నేను ఇప్పటి వరకు విన్న కథలో ఇది డిఫరెంట్‌గా ఉంది. ‘వీక్షణం’(Veekshanam) లో ప్రీ క్లైమాక్స్ (Climax)తో పాటు మరికొన్ని హుక్ సీన్స్ ఉంటాయి. అవి చాలా బాగుంటాయి. ఇందులో సరదాగా ఉండే కుర్రాడిలా కనిపిస్తా. అతనికి పక్కవాడి జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది. తనకున్న ఈ మనస్తత్వం (mindset) వల్ల అతను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనేది మూవీలో మెయిన్ పాయింట్. ఈ యువకుడి జీవితంలోకి ఓ అమ్మాయి రావడం అతని కథ అనేక మలుపులు తిరగడం సినిమాలో చూస్తారు. హీరో క్యారెక్టర్ (character) సరదా నుంచి క్రమంగా సీరియస్ నెస్ వైపు మళ్లుతుంది. సరదాగా ఉండే ఆ యువకుడు... డిటెక్టివ్‌లా మారి తన చుట్టూ జరుగుతున్న విషయాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటాడు. ఈ క్రమంలోనే ఈ సినిమా లవ్ స్టోరీతో స్టార్ట్ అయ్యి మిస్టరీ థ్రిల్లర్‌గా మారుతుంది. మా సినిమా భయపెడుతూనే సమస్యలను ఎలా అధిగమించాలో చూపెడుతుంది. మొత్తంగా ప్రేక్షకులను మెప్పిస్తుంది అనే నమ్మకం ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు.