పెళ్లి చేసుకున్న కోలీవుడ్ హీరో.. టాలీవుడ్ హీరోయిన్

by GSrikanth |
పెళ్లి చేసుకున్న కోలీవుడ్ హీరో.. టాలీవుడ్ హీరోయిన్
X

దిశ, సినిమా : తాజాగా రిలీజైన '9అవర్స్'వెబ్ సిరీస్‌లో నటించిన మధు శాలిని సైలెంట్‌గా వివాహం చేసుకుని ప్రేక్షక అభిమానులు అవక్కాయ్యేలా చేసింది. అయితే ఇదివరకు మధు.. అల్లరి నరేష్ నటించిన కితకితలు మూవీలో సెకెండ్ హీరోయిన్‌గా, ఒక విచిత్రం, అగంతకుడు, కింగ్‌లో ఒక సాంగ్‌లో నటించింది. ఇకపోతే ఈమె పెళ్లి చేసుకున్నది మరెవరినో కాదు.. తమిళ యంగ్ హీరో గోకుల్ ఆనంద్‌ని. ఇక వీరిద్దరు గతంలో 'పంచాక్షరం' తమిళ సినిమాలో నటించారు. ఆ మూవీ టైంలోనే వీరిమధ్య చిగురించిన స్నేహం, ప్రేమగా మారి.. చివరకు పెళ్లి పీటల వరకు తీసుకొచ్చిందని టాక్. దీంతో వీరి పెళ్లి గురువారం జూన్ 16న హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖుల మధ్య జరిగింది. కాగా వీరి వివాహ వేడుక గురించి ట్విట్టర్ వేదికగా మధు శాలిని తెలియజేసింది.



Advertisement

Next Story