‘మొసలితో ఫైట్ సీన్ కోసం వారం రోజులు నీళ్లలోనే ఉన్నాడు’.. స్టార్ హీరోపై డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Kavitha |   ( Updated:2024-10-25 15:09:55.0  )
‘మొసలితో ఫైట్ సీన్ కోసం వారం రోజులు నీళ్లలోనే ఉన్నాడు’..  స్టార్ హీరోపై డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ‘కంగువ’ మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీకి డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో దిశ పటానీ హీరోయిన్ నటిస్తుండగా.. బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్నట్లు సమాచారం. కాగా ఈ మూవీ నవంబర్ 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రమోషన్ల బిజీలో ఉన్నారు చిత్ర బృదం. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ శివ కంగువ సినిమాలో సూర్య ఎంత కష్టపడ్డారో తెలిపారు.

శివ మాట్లాడుతూ.. “సినిమాలో మొసలితో ఉండే ఫైట్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్‌గా ఉంటుంది. ఈ సీన్ కోసం వేల మంది పనిచేశారు. ఆ యాక్షన్ సీక్వెన్స్‌ని బ్యాంకాక్‌లో, చెన్నైలో షూట్ చేశాము. ఆ సీన్ కోసం దాదాపు సూర్య వారం రోజుల పాటు నీళ్లలోనే ఉంటూ నటించాల్సి వచ్చింది. ఆ టైంలో ఆయన్ని బాగా కష్టపెడుతున్నాను ఏమో అని అనిపించింది. ఆయన డెడికేషన్‌కి హ్యాట్సాఫ్ అని అన్నారు. దీంతో ఆ మొసలి సీన్, సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

Advertisement

Next Story

Most Viewed