ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్!

by Harish |
ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్!
X

ముంబై: దేశీయ అతిపెద్ద ప్రైవేట్ రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల(ఎఫ్‌డీ)పై వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. గత నెలలోనే ఈ వడ్డీ రేట్లను పెంచిన బ్యాంక్ మరోసారి పెంచుతూ ఖాతాదారులకు శుభవార్త అందించింది. పెంచిన వడ్డీ రేట్లు బుధవారం(ఏప్రిల్ 6) నుంచే అమల్లోకి వస్తాయని, ఎంపిక చేసిన కాలవ్యవధులకు మాత్రమే ఇవి వర్తిస్తాయని బ్యాంకు వెల్లడించింది. రూ. 2 కోట్ల కంటే తక్కువ ఉన్న ఎఫ్‌డీలపై ఈ కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయని, ఏడాది ఎఫ్‌డీలపై వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్లు(0.1 శాతం) పెంచగా వడ్డీ రేటు 5 శాతం నుంచి 5.10 శాతానికి చేరుకుందని బ్యాంకు తెలిపింది.

అలాగే, 2 ఏళ్ల కాలవ్యవధి కలిగిన ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను 5 శాతం నుంచి 5.10 శాతానికి పెంచింది. అంతేకాకుండా ఐదేళ్ల కాలవ్యవధికి చెందిన రూ. 5 కోట్ల కంటే తక్కువ ఎఫ్‌డీలపై సీనియర్ సిటిజన్లకు 25 బేసిస్ పాయింట్ల(0.25 శాతం) ప్రీమియంను బ్యాంక్ చెల్లిస్తుందని, ఈ ప్రత్యేక ఆఫర్ సాధారణ 0.5 శాతం ప్రీమియంతో ఇస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏడాది కాలవ్యవధి కలిగిన ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను 4.9 శాతం నుంచి 5 శాతానికి, 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల కాలవ్యవధి కలిగిన ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను 5.40 శాతం నుంచి 5.45 శాతానికి పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకుంది.

Advertisement

Next Story

Most Viewed