మాస్ మహారాజ రవితేజ కూతుర్ని చూశారా..? హీరోయిన్లను మించిన అందం అంటున్న నెటిజన్లు

by Kavitha |   ( Updated:2024-10-14 14:39:40.0  )
మాస్ మహారాజ రవితేజ కూతుర్ని చూశారా..? హీరోయిన్లను మించిన అందం అంటున్న నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: మాస్ మహారాజ రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన సొంత శక్తితో స్టార్ హీరోగా ఎదిగాడు. కెరీర్ తొలినాళ్లలో హీరోల పక్కన సైడ్ క్యారెక్టర్ చేస్తూ ఆ తర్వాత హీరోగా మారిపోయాడు. హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలె ‘మిస్టర్ బచ్చన్’ మూవీతో ఆకట్టుకున్న రవితేజ.. ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీతో బిజీ బిజీగా ఉన్నాడు.

ఇదిలా ఉంటే.. రవితేజ సినిమాలను పక్కన పెడితే.. అతని ఫ్యామిలీకు చెందిన విషయాలు చాలా మందికి తెలియదు. కానీ ఈ మధ్య కాలంలో వారికి సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులకు చూపిస్తున్నాడు రవితేజ. ఈ క్రమంలో వీరి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా రవితేజ షూటింగ్‌లకు కాస్త గ్యాప్ ఇచ్చి.. తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు జపాన్, బ్యాంకాక్ వంటి ప్రదేశాలు చుట్టి వచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్త వైరల్‌గా మారాయి.

ఇక ఈ పిక్స్‌లో రవితేజ, ఆయన భార్య, కొడుకు, కూతురుతో పాటు మరికొంత మంది బంధువులు ఉన్నారు. అయితే అందరి కన్ను మాత్రం మాస్ మహారాజా కూతురు మోక్షద భూపతి పైనే ఉన్నది. బయట అంతగా కనిపించని ఈ క్యూటీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఫొటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఇక వీటిని చూసిన నెటిజన్లు హీరోయిన్లను మించిన అందం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా మోక్షద త్వరలో సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.


Advertisement

Next Story