- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Rahul Gandhi: విద్వేషం, హింసతో దేశం బలహీనం: రాహుల్ గాంధీ ట్వీట్

X
న్యూఢిల్లీ: శ్రీరామనవమి వేడుకల్లో పలు రాష్ట్రాల్లో చెలరేగిన హింస పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్వేషం, హింస దేశాన్ని బలహీనంగా చేస్తున్నాయని అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. న్యాయమైన, సమ్మిళిత దేశాన్ని కాపాడుకోవడానికి భారతీయులందరూ కలిసి నిలబడాలని ఆయన కోరారు. హింస, విద్వేషం మన ప్రియమైన దేశాన్ని మరింత బలహీనంగా చేస్తున్నాయి. సోదరభావం, శాంతి, సామరస్యం అనే ఇటుకలతో ప్రగతి బాటలు వేయబడ్డాయి. న్యాయమైన, సమ్మిళిత భారతదేశాన్ని కాపాడుకోవడానికి కలిసి నిలబడదాం అని ట్వీట్ చేశారు.
Next Story