తెలుగు తెరపైకి 'చలం' బయోపిక్.. త్వరలో అధికారిక ప్రకటన

by Mahesh |
తెలుగు తెరపైకి చలం బయోపిక్.. త్వరలో అధికారిక ప్రకటన
X

దిశ, సినిమా: భారతీయ చిత్రసీమలో ప్రస్తుతం బయోపిక్స్ హవా నడుస్తోంది. తద్వారా ప్రముఖ క్రీడాకారులు, పోలీస్ ఆఫీసర్స్, శాస్త్రవేత్తలు, సినీ ప్రముఖుల జీవిత కథలు ఈ తరానికి పరిచయం చేస్తున్న దర్శకులు.. రచయితల జీవితాలపై కూడా కన్నేశారు. ఈ క్రమంలోనే ప్రముఖ కవి 'విశ్వనాథ సత్యనారాయణ' జీవిత చరిత్ర ఆధారంగా 'కవి సామ్రాట్' తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాగా త్వరలోనే మరో రచయిత 'గుడిపాటి వెంకటాచలం' బయోపిక్ కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది.

'అన్నమయ్య, శ్రీరామదాసు' చిత్రాలకు కథ , మాటలు అందించిన 'జేకే భారవి' చలం బయోపిక్ తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. అంతేకాదు టైటిల్ రోల్ కోసం కీరవాణిని సంప్రదించగా.. ఈ పాత్రకు తాను న్యాయం చేయలేనని సున్నితంగా తిస్కరించినట్లు సమాచారం. ఇక తెలుగు సాహిత్యంలో చలం సృష్టించిన అభ్యుదయ భావాల స్త్రీ పాత్రలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story