- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విమాన ఇంధనాన్ని జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు ప్రభుత్వ ప్రతిపాదన!
దిశ, వెబ్‌డెస్క్: విమానాల్లో వాడే ఇంధనం ఏవియేషన్ టర్బైన్ ఫ్యుయెల్(ఏటీఎఫ్)ను వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఏటీఎఫ్‌పై 18 జీఎస్టీతో పాటు వ్యాట్ లేదంటే ఎక్సైజ్ ధరను రాష్ట్రాలు విధించే వెసులుబాటు కల్పించేలా ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. వ్యాట్ లేదా ఎక్సైజ్ ధర రాష్ట్రాలను బట్టి మారవచ్చు. అంతర్జాతీయంగా పలు దేశాలు ఏటీఎఫ్‌పై జీఎస్టీ విషయంలో ఒక నిర్దిష్టమైన సూత్రాన్ని అనుసరిస్తున్నాయని, దానికి అదనంగా వ్యాట్ లేదా ఎక్సైజ్ విధిస్తున్నట్టు ప్రభుత్వాధికారి ఒకరు పేర్కొన్నారు.
రాబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్రం ఈ ప్రతిపాదనను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముందుకు తీసుకురానున్నట్టు, జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం లభించిన వెంటనే అమల్లోకి తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. అంతర్జాతీయ ముడి చమురు ధరలు భారీగా పెరుగుతుండటంతో దేశవ్యాప్తంగా ఏటీఎఫ్ ధరలు కూడా అధికంగా మారాయి. గ్లోబల్ చమురు ధరల పెరుగుదల తర్వాత రెండు నెలల్లో జెట్ ఇంధనం ధరలను నాలుగు సార్లు పెంచారు. రానున్న రోజుల్లో ఈ పెంపు మరింత పెరిగితే ఇప్పటికే కరోనాతో దెబ్బతిన్న విమానయాన రంగం ఇంకా కష్టాల్లో పడనుంది.