- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండోసారి ఐపీఓకు డ్రాఫ్ట్ పత్రాలు సమర్పించిన ఎల్ఐసి!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ కార్పొరేషన్(ఎల్ఐసీ) ఐపీఓ కోసం అప్‌డేట్ చేసిన డ్రాఫ్ట్ పత్రాలను సమర్పించింది. ఇందులోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను కూడా జత చేసి అనుమతి కోసం సెబీకి అందజేసింది. గత నెల రెండోవారంలోనే ఎల్ఐసీ మొదటిసారిగా సెబీకి ఐపీఓ దరఖాస్తును ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల వివరాలను సమర్పించింది. ఈ దరఖాస్తుకు సెబీ సైతం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో మే 12 వరకు ఎల్ఐసీ సంస్థ పబ్లిక్ ఇష్యూ కి రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఆలోపు ఐపీఓకు రాకపోతే నిబంధనలను అనుసరిస్తూ మరోసారి ఐపీఓ అనుమతి పత్రాలను ఇవ్వాల్సి ఉంటుంది.
అయితే, తాజాగా రెండోసారి డ్రాఫ్ట్ పత్రాలను ఇవ్వడంతో పబ్లిక్ ఇష్యూ గడువు తేదీ మరింత పెరుగుతుంది. దీనివల్ల వివిధ పరిణామాల కారణంగా ఒడిదుడుకుల్లో మార్కెట్ పరిస్థితులను అంచనా వేస్తూ ఎల్ఐసీని ఐపీఓకు తెచ్చేందుకు ప్రభుత్వానికి కొంత సమయం లభిస్తుంది. కాగా, కొత్తగా సమర్పించిన డ్రాఫ్ట్ ఫైల్ ప్రకారం.. డిసెంబర్ త్రైమాసికంలో ఎల్ఐసీ రూ. 235 కోట్ల నికర లాభాలను వెల్లడించింది. అలాగే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ మధ్య మొత్తం రూ. 1,671 కోట్ల లాభాలను సాధించింది. అంతకుముందు ఇదే సమయంలో రూ. 7.08 కోట్ల లాభాలను నమోదు చేసింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసీ ఐపీఓను పూర్తి చేయాలని ప్రభుత్వం భావించినప్పటికీ రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం వల్ల స్టాక్ మార్కెట్లు భారీగా క్షీణించాయి.