- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దానికి టైం కావాలని అడిగితే షారుఖ్ వినలేదు.. గౌరీ
దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్స్‌లో షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ జంట ఒకటి. మతాలు వేరైనా ప్రేమించి పెళ్లి చేసుకుని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన ఈ కపుల్స్ జీవితంలో ఎదురయ్యే కష్ట, నష్టాలను ఎదుర్కొంటూ ఒకరికొకరు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. ఇటీవల కొడుకు ఆర్యన్‌ఖాన్ డ్రగ్స్ కేసు విషయంలో కూడా భర్తకు అండగా నిలిచిన గౌరీ.. ఒకానొక సమయంలో షారుఖ్‌ని వదిలేద్దామనుకున్నానంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. కాఫీ విత్ కరణ్ ఎపిసోడ్‌లో పాల్గొన్న గౌరీ.. తన లవ్ స్టోరీ కి సంబంధించిన కొన్ని విషయాలను అభిమానులతో పంచుకుంది.
తాము పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు అది పెద్ద సమస్యగా అనిపించలేదు. కానీ, తను కొద్దిగా సమయం తీసుకుంటానని చెబితే షారుఖ్ వినలేదని చెప్పింది. దీంతో మ్యానేజ్ చేయడానికి ఎంత ప్రయత్నించినా ఆయన మాయ చేశాడన్న గౌరీ.. షారుఖ్‌ఖాన్‌కు పోసిసివ్ నెస్ ఎక్కువ అని తెలిపింది. ఈ క్రమంలోనే తనకంటూ ఒక పర్సనల్ స్పేస్ కావాలని గట్టిగా అడిగి తన నుండి దూరంగా వెళ్ళిపోదామనుకున్నానన్న ఆమె.. ఆ తర్వాత నెమ్మదిగా ఆలోచించించుకొని తన దగ్గరకే వచ్చి చేరానని సరదాగా చెప్పుకొచ్చింది.