- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
iPhone 17 Pro: యాపిల్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఐఫోన్ 17 ప్రోలో భారీ మార్పులు!
దిశ, వెబ్‌డెస్క్: యాపిల్ లవర్స్(Apple lovers) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ సంవత్సరం (2024)సెప్టెంబరులో ఐఫోన్ 16 లాంచ్ అయ్యింది. దీంతో చాలా మంది యాపిల్ లవర్స్ ఈ మోడల్ కొనుగోలు చేశారు. ఇప్పుడు ఫోన్ ప్రియుల ఫోకస్ అంతా ఐఫోన్ 17 ప్రో (iPhone 17 Pro) పై పడింది. నెక్ట్స్ వచ్చే ఐఫోన్‌లో ఎలాంటి ఛేంజెస్ చేస్తారు? ఏఏ ఫీచర్స్ వస్తాయి..? అని తెలుసుకునేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఐఫోన్ 17 ప్రో మోడల్ గురించి పలు విషయాలు బయటకొచ్చాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ఐఫోన్ 17 ప్రోలో మెటీరియల్ డౌన్‌గ్రేడ్(Material downgrade) వస్తోందట. గతంలో వచ్చిన ఐఫోన్ 12ప్రో, 13ప్రో, 14 ప్రో, 15 ప్రో, 16 ప్రో మోడళ్లలో వాడిన స్టెయిన్లెస్ స్టీల్(Stainless steel) కంటే ఎక్కువ మన్నికైనది వస్తుందట. నెక్ట్స్ వచ్చే ఐఫోన్ 17 ప్రో టైటానియం(Titanium) కు బదులుగా అల్యూమినియం ఫ్రేమ్(Aluminum frame)ను యూస్ చేయనున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. అలాగే డిజైన్‌లో కూడా మార్పులు చేర్పులు జరగనున్నాయి.
ఐఫోన్ 17 ప్రో మోడళ్లు గూగుల్ పిక్సెల్ ౯(Google Pixel), పిక్సెల్ 9 ప్రోలలో కనిపించే దీర్ఘచతురస్రాకార కెమెరా మాడ్యూల్(Rectangular camera module)ని కలిగి ఉంటాయని సమాచారం. అలాగే ఐఫోన్ 17 ప్రో ఏ19 ప్రోతో హై పర్ఫార్మెన్స్నిస్తుందని టాక్. ఏ 19 ప్రో చిప్‌తో పనిచేస్తుంది. ఏ19 ప్రో 3 NM చిఫ్సెట్గా TSMP రెడీ చేయనుందని తెలుస్తోంది. అలాగే 12 GB ర్యామ్ ఉంటుందట. ఈ డిటైయిల్స్ అన్ని నెట్టింట వైరల్ అవుతున్నవి మాత్రమే. అధికారికంగా ప్రకటించినవి కాదు.