- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత..
దిశ, శంషాబాద్: గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డ ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో జరిగింది. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం దుబాయ్ నుండి (EK-524) ఎమిరేట్స్ విమానంలో హైదరాబాద్ వచ్చేందుకు ఓ ప్రయాణికుడు శంషాబాద్ విమానాశ్రయంలో దిగాడు. అయితే, విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా ప్రయాణికునిపై అనుమానం వచ్చి పూర్తిగా స్కాన్ చేసి బంగారం ఉన్నట్లు గుర్తించారు. ప్రయాణికుడు బంగారాన్ని జీన్స్ పాయింట్‌కు లోపలివైపు ప్రత్యేకంగా కుట్టుకున్న జేబులో పెట్టుకుని తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. అతడి వద్ద నుండి 61 లక్షల 72 వేల రూపాయల విలువ జేసే 1కిలో 144 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పేర్కొన్నారు.