- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్త భాష నేర్చుకునే వారికి బంపర్ ఆఫర్.. రూ. 4లక్షల ఫ్లయిట్ టికెట్స్
దిశ, ఫీచర్స్ : ఓ కొత్త భాష నేర్చుకోవడంతో పాటు అంతర్జాతీయ ట్రిప్ వెళ్లే బంపర్ ఆఫర్ ఇచ్చింది టాప్ రేటెడ్ లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్ 'బాబెల్'(Babbel). లైఫ్ టైమ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల రెండు ($5,000 వరకు విలువ!) ఫ్లయిట్ టికెట్స్ గెలుచుకునే అవకాశాన్ని అందిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది వినియోగదారులకు ఒక కొత్త భాషను నేర్చుకునేందుకు లేదా భాషా నైపుణ్యాలు పెంచుకోవడానికి సాయం చేస్తున్న బాబెల్ యాప్‌లో 150 మందికి పైగా భాషా నిపుణులు అందుబాటులో ఉన్నారు. ఈ మేరకు 14 భాషలకు (స్పానిష్, ఫ్రెంచ్, ఇటాలియన్, జర్మన్, టర్కిష్, పోలిష్ మరియు మరిన్ని) యాక్సెస్ అందిస్తుండగా, మన వీలును బట్టి 15 నిమిషాల వ్యవధిలో నేర్చుకునే అభ్యాసాలను అందిస్తున్నారు.
ఇక లైవ్ క్లాసెస్ తీసుకోకపోయినా, బాబెల్స్ స్పీచ్ రికగ్నిషన్ ఫీచర్ ద్వారా మనం పాఠాలను చదివేటప్పుడు ఉచ్ఛారణ, యాస విషయంలో తగు సూచనలు అందిస్తుంది. ఆఫ్‌లైన్ మోడ్‌లోనూ ఇందులో పాఠాలు వినే అవకాశముండగా, ప్రస్తుతం కొత్త కస్టమర్స్‌ను ఆకట్టుకునేందుకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. గతంలో $499 ధరకు లైఫ్‌టైమ్ సబ్‌స్కిప్షన్ అందించిన బాబెల్.. ప్రస్తుతం కేవలం రూ.15 వేలకే అందిస్తోంది. తద్వారా దాదాపు రూ. 23 వేలు పొదుపు చేసుకోవడమే కాకుండా రూ. 3,82, 677 విలువ చేసే ఫ్లయిట్ టికెట్స్ గెలిచే అవకాశం అందిస్తోంది. ఈ ఆఫర్ మార్చి 15 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాగా సంతృప్తి చెందని వినియోగదారులు బాబెల్ 20-రోజుల మనీ-బ్యాక్ గ్యారెంటీతో సబ్ స్క్రిప్షన్ రుసుమును తిరిగి పొందవచ్చు.