'ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు.. వాళ్లు రోడ్డునపడే అవకాశం'

by GSrikanth |
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు.. వాళ్లు రోడ్డునపడే అవకాశం
X

దిశ, సుల్తానాబాద్: మానేరు పరివాహక ప్రాంతాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ల టెండర్లు రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు కాంట్రాక్ట్ టెండర్లు దక్కించుకున్న వారికి వరంలా మారాయని కాసుల కోసం కక్కుర్తిపడి చెక్ డ్యామ్ పేరిట కోటి యాభై లక్షల 38220 మీటర్ల ఇసుక తరలింపునకు పూనుకున్నారని ధ్వజమెత్తారు. సోమవారం సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల్లా, గట్టేపల్లి గ్రామాల్లో కాలినడకన తిరుగుతూ సందర్శించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇసుక రీచ్ల టెండర్ల వల్ల సాండ్ టాక్సీలు నడుపుకునే ట్రాక్టర్ డ్రైవ‌ల జీవితాలు రోడ్లమీద పడతాయని అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం టీఎస్ఎండీసీ లారీల ద్వారా ఇసుక తీయడం చట్ట విరుద్ధమని అన్నారు. మానేరు ప్రాంత ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి వారి అనుమతితో ఇసుక తీయాల్సి ఉండగా, అదేం పట్టించుకోకుండా కాంట్రాక్టర్ల కోసం పనిచేస్తున్న విధంగా ప్రభుత్వం తీరు ఉందన్నారు. తాగు, సాగునీటి అవసరాలకు భూగర్భ జలాల తగ్గి ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉందని దీనిని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని మాజీ ఎమ్మెల్యే విజయ రామారావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట నాయకులు అంతటి అన్నయ్య గౌడ్, మినుపాల ప్రకాష్ రావు, చిలుక సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed