కెనడాలో ఐదుగురు భారతీయ విద్యార్థులు మృతి

by samatah |   ( Updated:2022-03-14 03:19:23.0  )
కెనడాలో ఐదుగురు భారతీయ విద్యార్థులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : కెనడాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు భారతీయ విద్యార్థులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్లితే.. కెనడాలోని ఒంటారియో హైవేపై వెళ్తున్న వ్యాన్‌ అదుపు తప్పి ట్రాలీని ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. కాగా, రోడ్డు ప్రమాదంలో ఐదుగురు భారతీయ విద్యార్థులు చనిపోయారని కెనడాలోని భారత హైకమిషనర్ అజయ్ బిసారియా సోమవారం వెల్లడించారు. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Advertisement

Next Story