అచ్చంపేటలో ఉద్రిక్తత.. రోడ్డుపై వేరుశనగను తగులబెట్టిన రైతులు

by S Gopi |
అచ్చంపేటలో ఉద్రిక్తత.. రోడ్డుపై వేరుశనగను తగులబెట్టిన రైతులు
X

దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో వేరుశనగకు మద్దతు ధర ఇవ్వాలని రైతులు రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. అంతకుముందు పట్టణంలో రైతులు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ దళారీ వ్యవస్థ మూలంగా తాము నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అచ్చంపేట మార్కెట్ యార్డులో దళారీ వ్యవస్థతో రైతన్నలు మోసపోతున్నారని మండిపడ్డారు.

రైతులు ఆరుగాలం కష్టించి పండించిన వేరుశనగ పంటకు మద్దతు ధర ప్రకటించేంతవరకు ఆందోళన విరమించేదిలేదని రైతులు డిమాండ్ చేశారు. మద్దతు ధర కల్పిస్తామని మార్కెట్ కమిటీ సీఈఓ మరియు ఛైర్మన్ హామీ ఇస్తేనే ఆందోళన విరిమమిస్తామనని రైతులు భీష్మించి కూర్చున్నారు.

వేరుశనగ రోడ్డుపై పోసి..

వేరుశనగ పంట మద్దతు ధర లేకపోవడంతో ఆవేదన చెందిన రైతులు వేరుశనగను రోడ్డుపై పోసి తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దళారీ వ్యవస్థకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అధికారులు దళారీ వ్యవస్థకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed