- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Tomato Prices: నేలపాలైన టమాట.. ఆటో ఖర్చులు కూడా రాక రోడ్డు పాలు..
దిశ ప్రతినిధి, రంగారెడ్డి, చేవెళ్ల: Farmers dump tomatoes on roads as prices crashed In Rangareddy| చేవెళ్ల మండల కేంద్రంలోని కూరగాయల మార్కెట్ లో షాబాద్ మండలంలోని మల్లారెడ్డి గూడ గ్రామానికి చెందిన సుదర్శన్ అనే రైతు తన రెండు ఎకరాల్లో టమాట పంట వేసాడు. ఆ పంటను చేవెళ్ల మార్కెట్ కు అమ్ముకోవడానికి 100 బాక్సుల్లో తీసుకువచ్చాడు. అసలు టమాటను ఎవరు తినకపోవడం, కనీసం ఆటో ఖర్చు డబ్బులు కూడా రాకపోవడంతో రైతు అక్కడే టమాటాలు పారబోసాడు.
వర్షాలతో సగం పంట నాశనం ఐతుంటే.. ధర లేక ఇంకా నష్టపోతున్నట్లు రైతు తెలిపారు. ఎన్నో రోజులు శ్రమించి సాగు చేసిన టమాటా చేతికొచ్చిన తర్వాత ధర లేకపోవడంతో రోడ్డుపై పారబోసే పరిస్థితి వచ్చింది. రంగారెడ్డి జిల్లాలో అత్యధిక రైతులు కూరగాయల పంట సాగునే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి రైతుల్లో ఇప్పుడు కన్నీళ్లు కారుతున్నాయి.
పెట్టుబడి, శ్రమను తాకట్టు పెట్టి పండించిన టమాట పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో మార్కెట్ తెచ్చిన రైతులకు ఆటో చార్జీలు కూడా రాకపోవడంతో లబోదిబోమంటూ నేలపాలైతున్న టమాటా అటు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ప్రోత్సహకం అందిస్తున్నామని చెబుతున్నప్పటికీ భరోసా లేకుండా పోయింది. ప్రస్తుతం టమాటా ధర పూర్తిగా పడిపోవడంతో పెట్టిన పెట్టుబడి కూడా రాని వైనం ఉంది. గత 20 రోజుల క్రితం వరకు టమాటా ధర స్థిరంగా ఉన్నప్పటికి ప్రస్తుతం ధర కిలో రూ.5 లు పలుకుతుంది. కొందరు రైతులు మార్కెట్కు తీసుకపోవడమే అనవసరంగా భావించి పశువులకు మేతగా వాడుతున్న వైనం చేవెళ్ల, శంకర్పల్లి మండలంలో కనిపిస్తుంది.
టమాటా ధర ఎందుకు పడిపోయింది..!
కొన్ని నెలల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని అర్బన్ ప్రాంతాల్లో విచ్చలవిడిగా టమాట సరఫరా అవుతుంది. దీంతో స్థానికంగా సాగు చేసే టమాటను కొనుగోలు చేయడంలో ఆసక్తి చూపడం లేదు. అంతేకాకుండా స్థానికంగా ఉండే వ్యవసాయ కూరగాయల మార్కెట్ అధికారులు ఇతర రాష్ట్రాల నుంచి సరఫరా అయ్యే కూరగాయలకు ధరలు చెల్లిస్తారు. కానీ అదే స్థానికంగా సాగు చేసి పండించే కూరగాయలకు సరియైన ధరలు చెల్లించడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు.
లోకల్ గా పండించే టమాటకు ధర లేదని కిలో రూ.5 నుంచి రూ.8 లు మాత్రమే చెల్లిస్తున్నారు. అదే వ్యవసాయాధికారులు మాత్రం ఇతర ప్రాంతాలకు సరఫరా చేసే క్రమంలో కిలోకు రూ.20 ల పైన వసూల్ చేయడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగంగా విక్రయించే వారికి ఓ ధర, సాగు చేసి శ్రమించే రైతులకు చెల్లించడం మరోక ధర ఇదేక్కడి న్యాయం అని అధికారులను ప్రశ్నిస్తున్నారు. దేశీయ టమాట కంటే వీదేశీయా టమాటకే ఆధరణ పెరుగుతుందని అధికారులు చెప్పడం సిగ్గుచేటు.
టమాట సాగు..
ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలోని టమాట సాగు భారీగా నష్టపోయింది. మిగిలిన సాగుతోనైన పెట్టుబడి సాయం దక్కుతుందని ఆశించిన రైతులకు భంగపాటు కలుగుతుంది. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, కందుకూరు డివిజన్ పరిధిలో టమాట సాగు చేశారు. ఇందులో చేవెళ్ల డివిజన్లోనే అత్యధికంగా టమాట సాగు ఉంటుందని అధికారులు వివరిస్తున్నారు. చేవెళ్లలో 1600, షాబాద్లో 800, మొయినాబాద్లో 850, శంకర్పల్లి లో 680 ఎకరాల చొప్పున ప్రతి మండలంలో టమాట సాగు చేశారు. కానీ కురిసిన వర్షాలకు ఇందులో 35 శాతం మేర పంట నస్టపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టాన్ని పూడ్చుకుందామంటా ధరలు లేక రైతులు విలవిల్లాడుతున్నారు.