- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నోటీసులు చూపించిన ఆఫీసర్లు.. పురుగులమందు తాగిన రైతు
దిశ, కరకగూడెం: కరకగూడెం మండల కేంద్రం కన్నాయిగూడెం గ్రామంలో 25 సంవత్సరాలుగా గిరిజన పోడు రైతు సుతారి శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి సాగుచేసుకుంటున్న భూమిలో ఫారెస్ట్ అధికారులు మొక్కలు నాటనున్నట్లు నోటీసులు చూపించారు. దీంతో మనస్తాపానికి గురైన శ్రావణ్ కుమార్ తమ జీవనాధారమైన భూమిని కోల్పోతానన్న భయంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ విషయం గమనించిన గ్రామస్తులు వెంటనే అతన్ని పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి వైద్యులు అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తేల్చి చెప్పడంతో వెంటనే భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అతడి ప్రాణాలకు ఏమైనా హాని జరిగితే ఫారెస్ట్ అధికారులే పూర్తి బాధ్యత వహించాలని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పక్క ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెబుతూ, దరఖాస్తులు స్వీకరించి.. మరోవైపు అదే ప్రభుత్వం ఫారెస్ట్ అధికారులతో పోడు భూములలో మొక్కలు నాటే ప్రయత్నం చేస్తోందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రెండు రోజుల క్రితం కన్నాయిగూడెం గ్రామంలో వీరాపురం బీట్ అధికారి అయిన విజయ్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తేజస్విని ఆధ్వర్యంలో వారి సిబ్బందితో వచ్చి కన్నాయిగూడెం గ్రామంలో పోడు సాగు చేసుకుంటున్న రైతుల భూములలో యంత్రాలతో ట్రెంచ్ లను తీసి మొక్కలు నాటుతామని గ్రామస్తులను హెచ్చరించి వెళ్లారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోడు భూములను వదులుకోమని, ఫారెస్ట్ అధికారులు గిరిజనులపై చేస్తున్న దౌర్జన్యంపై గిరిజనులు అందరం ఏకమై పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ పరిస్థితికి కారణమైన బీట్ అధికారి విజయ్ పై కేసు నమోదు చేసి, వెంటనే సస్పెండ్ చేయాలని గ్రామస్తులు కల్తి రత్తయ్య, సుతారి నరసింహారావు, ఉకే కేశవరావు, కలం లక్ష్మయ్య, వార్డు మెంబర్ పోలెబోయిన రామయ్య, పోలెబోయిన పుల్లయ్య, పీసా కమిటీ ఉపాధ్యక్షుడు పోలెబోయిన శేఖర్, తుడుందెబ్బ మండల అధ్యక్షుడు ఊకే గణేష్, ఊకే వెంకటేశ్వర్లు, గొప్ప సతీష్ డిమాండ్ చేశారు.