భారత్‌పై అంక్షలు నిజంగా మూర్ఖత్వమే: బైడన్ ప్రభుత్వానికి తేల్చిచెప్పిన రిపబ్లికన్ సెనెటర్

by Harish |
భారత్‌పై అంక్షలు నిజంగా మూర్ఖత్వమే: బైడన్ ప్రభుత్వానికి తేల్చిచెప్పిన రిపబ్లికన్ సెనెటర్
X

వాషింగ్టన్: భారత్‌పై ఆంక్షలు విధించడం నిజంగా మూర్ఖత్వమేని యూఎస్ రిపబ్లికన్ సెనెటర్ టెడ్ క్రూజ్ అన్నారు. రష్యా నుంచి భారత్ ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రష్యా యుద్ధం చేస్తున్న నేపథ్యంలో బైడన్ ప్రభుత్వం భారత్ పై ఆంక్షలు విధించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రపంచంలోనే 'అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్న దేశంపై ఇలాంటి చర్యలు నిజంగా మూర్ఖత్వమే. చాలా విభాగాల్లో భారత్ కీలకమైన అమెరికాకు భాగస్వామిగా ఉంది. గత కొన్ని ఏళ్లుగా ఈ సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయి. అయితే బైడెన్ ప్రభుత్వ హయాంలో తిరిగి వెనక్కి వెళ్లేలా ఉన్నాయి' అని అన్నారు. యూఎన్ సమావేశంలో యూఎస్‌కు వ్యతిరేకంగా భారత్ ఓటు వేయలేదని అన్నారు. దీంతో పాటు మరో మూడు దేశాలు తటస్థంగా ఉన్నాయని చెప్పారు. . అయితే విదేశీ విధానాల పట్ల ప్రస్తుతం బైడెన్ అనుసరిస్తున్న వైఖరి సరైనది కాదని చెప్పారు. కాగా, ఇరాన్, ఉత్తర కొరియా లేదా రష్యాతో గణనీయమైన లావాదేవీలను కలిగి ఉన్న ఏ దేశంపైనైనా ఆంక్షలు విధించడానికి సీఏఏటీఎస్ఏ చట్టాన్ని అమెరికా ఉపయోగిస్తుంది.

Advertisement

Next Story