- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రభుత్వ గురుకులాల్లో ప్రవేశాలు.. అర్హులు వారే..
దిశ, చిన్నశంకరంపేట: ప్రభుత్వ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాల పరీక్ష ప్రకటన విడుదలైంది. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు TSWREIS, MJPTBCWREI, TREIS, TTWREIS గురుకుల పాఠశాలల్లో 2022-23 ఏడాది 5వ తరగతి ప్రవేశ పరీక్షకు సంబంధించిన ప్రకటన విడుదల చేశారు. కేజీ టు పీజీ మిషన్‌లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన, ఉత్తమ విద్యను అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ మిషన్ తీసుకొచ్చింది. విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి ఆయా రంగాలలో వారిని ప్రోత్సహించడానికి సాంఘిక, గిరిజన, వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కేజీ టు పీజీ మిషన్. ఈ మిషన్‌లో భాగంగా విద్యాశాఖల ఆధ్వర్యంలోని ఇంగ్లీష్ మీడియం గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశానికి అన్ని జిల్లాలలో ఎంపిక చేయబడిన కేంద్రాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించబడనుంది. దీనికి 2021- 2022 విద్యాసంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు మాత్రమే అర్హులు. ఈ పరీక్ష అప్లికేషన్ 09-03-2022 నుంచి 28-03-2022 వరకు స్వీకరించబడతాయి. 08-05-2022 తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించబడుతుంది. పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. www.tswreis.ac.in , www.tgcet.cgg.gov.in వెబ్‌సైట్స్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అభ్యర్థులు పాటించాల్సిన సూచనలు, వారి అర్హతలు
1. అభ్యర్థులు తమ అర్హతలను పరిశీలించుకుని తేదీ : 09-03-2022 నుండి 28-03-2022 వరకు ఆన్‌లైన్‌లో రూ. 100/- రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక ఫోన్ నెంబర్‌తో ఒక దరఖాస్తు మాత్రమే చేయగలము.
2. విద్యార్థుల ఎంపికకు పాత జిల్లా ఒక యూనిట్‌గా పరిగణీంచబడుతుంది.
3. ఓసీ (OC), బీసీ (BC) వారి పుట్టిన తేదీ 01-9-2011 నుండి 31-08 2013 మధ్య ఉండాలి.
ఎస్‌సీ (SC), ఎస్‌టి (ST) అభ్యర్తుల పుట్టిన తేదీ 01-09-2009 నుండి 31-08-2013 మధ్య ఉండాలి. ఎస్సీ కన్వర్టెడ్ క్రైస్తవ విద్యార్థులు పుట్టిన తేదీ 01-09-2009 నుండి 31-08-2013 మధ్య ఉండాలి.
4. 2021- 2022 విద్యాసంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
అప్లై చేసుకోవడానికి కావలసినవి
1. విద్యార్థి పేరు
2. ఇంటి పేరు
3. స్కూల్ బోనఫైడ్‌లో ఉన్న DATE OF BIRTH
4. మొబైల్ నెంబర్
5. విద్యార్థి ఆధార్ నెంబర్
6. కులం (వివరాలు)
7. ఆదాయం ( వివరాలు)
8. చదువుతున్న స్కూల్ అడ్రెస్
9. విద్యార్థి ఫోటో
10. విద్యార్థి సంతకం
11. తండ్రి పేరు
12. తల్లి పేరు
13. గ్రామం పేరు
14.మండలం పేరు
15. జిల్లా పేరు
16. పాత జిల్లా పేరు
17. విద్యార్థి చదువుతున్న జిల్లా పేరు
18. పోస్ట్ బాక్స్ నెంబర్
ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు వరంగల్ కమ్యూనిటీ రిలేషన్ అధికారి శ్రీనివాస్‌ను 9177839291 ద్వారా సంప్రందించవచ్చు.