- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పౌడర్ బ్రాండ్ 'డెర్మికూల్'ను సొంతం చేసుకున్న ఎఫ్ఎంసీజీ కంపెనీ ఇమామి!
కోల్‌కతా: ఎఫ్ఎంసీజీ సంస్థ ఇమామీ శుక్రవారం ప్రముఖ పౌడర్ బ్రాండ్ 'డెర్మికూల్' ను సొంతం చేసుకున్నట్టు ప్రకటించింది. డెర్మికూల్ మాతృసంస్థ రెకిట్ నుంచి రూ. 432 కోట్ల(పన్నులు, సుంకాలు మినహా)కు ఈ బ్రాండ్‌ను కొనుగోలు చేసినట్టు ఓ ప్రకటనలో తెలిపింది. డెర్మికూల్ వేసవిలో చల్లదనాన్ని అందించే పౌడర్ బ్రాండ్‌గా భారత మార్కెట్లో మెరుగైన ఆదరణను కలిగి ఉంది. డెర్మికూల్ బ్రాండ్‌ను కొనుగోలు చేయడం ద్వారా ఇప్పటికే, ఇమామికి ఉన్న వ్యాపార వృద్ధికి మరింత సామర్థ్యం అంది వచ్చిందని, మార్కెట్లో పోటీని తట్టుకునేందుకు సరైన వ్యూహం అనుసరిస్తున్నట్లు ఇమామి డైరెక్టర్ హర్ష వి అగర్వాల్ అన్నారు.
హీట్ పౌడర్, కూల్ టాల్క్ విభాగంలో తమను అగ్రస్థానంలో బలపడేందుకు, పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్, వేసవి ఉష్ణోగ్రతల నేపథ్యంలో మెరుగైన ఉత్పత్తులకు భవిష్యత్తులో బలమైన డిమాండ్ ఉండనుందని అగర్వాల్ పేర్కొన్నారు. హీట్ పౌడర్, కూల్ టాల్క్ విభాగం రూ. 700-800 కోట్ల మార్కెట్‌గా ఉంది. డెర్మికూల్ బ్రాండ్ మరింత సమర్థవంతంగా నిలిచేందుకు అవకాశాలున్నాయని అగర్వాల్ తెలిపారు. డెర్మికూల్ భారత మార్కెట్లో 20 శాతం వాటాను కలిగి ఉంది. దీనివల్ల ప్రస్తుతం ఇమామి మార్కెట్ 25 శాతం నుంచి 45 శాతానికి చేరుకోనుందని ఈడిల్‌వీస్ సెక్యూరిటీస్‌కు చెందిన అబ్నీష్ రాయ్ అన్నారు.