స‌ల‌స‌ల కాగుతున్న మెట‌ల్ లిక్విడ్‌లో చేయ్యిపెట్టాడు..! ఎలెన్ మ‌స్క్ హ‌డ‌లిపోయాడు!! (వీడియో)

by Sumithra |
స‌ల‌స‌ల కాగుతున్న మెట‌ల్ లిక్విడ్‌లో చేయ్యిపెట్టాడు..! ఎలెన్ మ‌స్క్ హ‌డ‌లిపోయాడు!! (వీడియో)
X

దిశ‌, వెబ్‌డెస్క్ః ప్ర‌మాద‌క‌ర‌మైన వాటిని చూడొచ్చేమో కానీ మ‌నం స్వ‌యంగా చెయ్య‌కూడ‌దు. మండుతున్న మంట‌లో నుండి స్పీడ్‌గా చెయ్యి పోనియ్య‌డం మామూలుగానే చూసుంటాము. అలాగే, స‌ల‌స‌ల కాగే నూనెలో చెయ్యిపెట్టి బ‌జ్జీలు తీయ‌డ‌మూ కొంద‌రు చేసుంటారు. కానీ వంద‌ల డిగ్రీల వేడిలో క‌రిగిపోయి ద్ర‌వంగా మారిన మెట‌ల్ లిక్విడ్‌లో ఎవ‌రైన వ‌ట్టి చెయ్యిని పెట్ట‌డం ఊహించి ఉంటారా..?! ఇది మాత్రం చాలా క‌ష్టం. కానీ, ఈ వైర‌ల్ వీడియోలో అదే జ‌రిగింది. కరిగిన లోహద్రావ‌కం మంట‌లు క‌క్కుతూ ప్ర‌వ‌హిస్తుంటూ ఓ వ్య‌క్తి తన చేతిని ఆ లిక్విడ్‌లో నుండి పోనిస్తుంటాడు. మెట‌ల్ లిక్విడ్‌ను తాకి, ఏంకాలేదు చూశారా అంటూ సంతోష‌ప‌డతాడు. ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైర‌ల్ అయ్యింది. దీనిపై ప‌లువురు చ‌ర్చించుకుంటుంటే స్పేస్ఎక్స్ అధినేత ఎలెన్ మ‌స్క్ కూడా ఈ వీడియోపై స్పందించాడు.

చాలామంది ఆ వీడియో ఫేక్ అని, ఎడిట్ చేసింద‌ని అంటే, కొంద‌రు సైంటిఫిక్‌గా అలా చేయొచ్చ‌ని అన్నారు. మొత్తానికి వీడియో నిజమైన‌దేన‌ని తేలింది. అయితే, చెయ్యి కాలకుండా చేసిన ఈ స్టంట్‌లో లైడెన్‌ఫ్రాస్ట్ ప్రభావం ఉంద‌ని అంటున్నారు. దీని వ‌ల్ల వేడి త‌గిలిన చర్మంపై తేమ వెంట‌నే వ‌స్తుంది, మ‌రోసారి వేగంగా మంట‌ను తాకిన‌ప్పుడు ఆ తేమ ఆవిరైపోతుంది. ఇలా వెంట‌వెంట‌నే తేమ వ‌స్తుండ‌టంతో చ‌ర్మానికి గాయం కాదు. ఇక‌, ఎలోన్ మస్క్ వీడియోపై వ్యాఖ్యానిస్తూ, 'ఇంట్లో దీన్ని ప్రయత్నించవద్దు' అన్నాడు.

Advertisement

Next Story