నరసింహుడికి ఏకాశీతి కలశాభిషేకం

by Mahesh |
నరసింహుడికి ఏకాశీతి కలశాభిషేకం
X

దిశ, యాదగిరిగుట్ట : శ్రీవారి మహోత్సవంలో భాగంగా శనివారం స్వయంభూ ప్రధానాలయంలో 'ఏకాశీతి కలశాభిషేకం' నిర్వహించారు. ఈ ఉత్సవంలో ఆలయ ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, ఉప ప్రధానార్చకులు, అర్చక, పారాయణీకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి‌ణి ఎన్.గీత, సహాయ కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు.

ఏకాశీతి కలశాభిషేకం విశిష్టత..

ఏకాశీతి అనగా 81 అని అర్థం. 81 కలశములలో ఆవాహన చేసుకున్న పవిత్ర శుద్ధ జలాలు, పంచామృతాలు, కస్తూరి, చందనం, సుగంధ ద్రవ్యాలు వివిధ రకాల పండ్ల రసాలు, భగవత్ ప్రీతికరమైన ఏలా, లవం, ఘన సుగంధ తీర్థ జలాలు ఒక్కటిగా చేసి శిలా మయ, లోహమయాది, సుదర్శన, ఆళ్వారాదుల, గరుడ, విష్వక్సేనాదుల, భగవత్ రామానుజాది. ఆచార్య పురుషుల, ఆండాళ్ (శ్రీగోదాదేవి) మూర్తులకు అభిషేకాలు చేస్తారు.

ఆగమ శాస్త్రం లో 81 సంఖ్య అత్యంత విశిష్ట‌లను కలిగి ఉంది. నవ భక్తి స్వరూపం(9) (9x9) తొమ్మిదిని తొమ్మిది చే గుణించగా (81) ఎనభై ఒకటి సంఖ్య ఏర్పడుతుంది. అనగా (1) ఒకటి నుంచి(9) తొమ్మిది వరకు లెక్కించ బడు అంకెలన్నీ పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారము, (జీవులతత్వము) (9) తొమ్మిది సంఖ్యకు సంకేతాలు (9) తొమ్మిది భక్తి తత్యములతో కలిసినపుడు భగవంతుని అనుగ్రహం పొంది ఆయా అంకెల ఉనికి కోల్పోకుండా సమస్థితిని కలిగి ఉంటాయి. పూర్ణ స్వరూపం అయిన (0) సున్న, (1) ఒకటి మొదలు (9) తొమ్మిది సంఖ్యలను చేరగా ఆ సంఖ్య విలువ ఎంతో గొప్పగా అభివృద్ధి చెందుతుంది. ఈ మహోత్సవానికి ప్రముఖులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed