- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా 'మష్రూమ్ మిక్స్' మెటీరియల్!
దిశ, ఫీచర్స్ : ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ప్రజల ఆరోగ్యానికి, భూగ్రహానికి పెద్ద ముప్పుగా పరిణమించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ నెల ఒకటో తేదీ నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం విధించిన విషయం తెలిసిందే. భారత్‌లోనే కాక ఇతర దేశాల్లోనూ ప్లాస్టిక్ వాడకాన్ని చట్టరీత్యా నేరంగా పరగణిస్తున్న నేపథ్యంలో ఓ స్టార్టప్.. మష్రూమ్ మిక్స్‌తో ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌ను భర్తీ చేసేందుకు పరిశ్రమిస్తోంది.
లండన్‌కు చెందిన మ్యాజికల్ మష్రూమ్ కంపెనీ పర్యావరణ అనుకూల ప్యాకేజింగ్ తయారుచేసే పనిలో ఉంది. ఇందులో భాగంగా వ్యవసాయ వ్యర్థాలను 'పుట్టగొడుగుల రూట్ స్ట్రక్చర్'తో మిళితం చేసి ప్లాస్టిక్‌కు ఆల్టర్నేటివ్ రూపొందిస్తోంది. ఖర్చుపరంగా ఇతరత్రా ప్యాకేజింగ్స్ మాదిరే ఉంటుంది. కానీ ఇది బయోడిగ్రేడబుల్ మెటీరియల్ కావడంతో 45 రోజుల్లో సహజంగా విచ్ఛిన్నమవుతుంది. దీంతో పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు.
యూఎన్ నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు కంపెనీలు, ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. సప్లయ్ చైన్ అంతటా కార్బన్ పాదముద్రను గణనీయంగా తగ్గించే ఆచరణీయ, తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారాల అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇటువంటి పరిష్కారాలు ప్రతిసారీ ఆసరాగా ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున అమలు కావడం లేదు.
- పాల్ గిల్లిగాన్, సీఈవో, మాజికల్ మష్రూమ్