- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చెరువుగా మారిన పార్క్.. అవస్థలు పడుతున్న కాలనీ వాసులు
దిశ, నిజాంపేట్ : చెరువును తలపిస్తున్న డ్రైనేజీ వరద కాలనీ వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. డ్రైనేజీ ఔట్ లెట్ లేకపోవడంతో భూగర్భ డ్రైనేజీ జలాలు కాలనీ పార్కు స్థలంలో పోగై దుర్గందబరితాన్ని వెదజల్లుతున్నాయి. సంవత్సరాల కొద్దీ ఈ సమస్యతో సతమతం అవుతున్న, కాలనీ వాసుల సమస్యలను పట్టించుకునే అధికారులు, ప్రజాప్రతినిధులు కరువయ్యారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని 2వ డివిజన్ సాయి కృష్ణ కాలనీలో ఈ దుర్గందపూరిత డ్రైనేజీ నీరు చిన్నపాటి చెరువు, కుంటను పోలి ఉంటూ స్థానిక ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇక్కడి సమస్యను పరిష్కరించాలని కోరుతూ పలుమార్లు ఎమ్మెల్యే, మేయర్, కార్పొరేటర్‌ల దృష్టికి కాలనీ వాసులు తీసుకువెళ్లినా ప్రయోజనం జరగలేదు. చెడు వాసనలతో, అనారోగ్యం భయంతో సాయి కృష్ణ కాలనీ వాసులు నిత్యం నరకాన్ని అనుభవిస్తున్నారు. చిన్నారులు ఆడుకుంటూ వెళ్లి చెరువును తలపించే డ్రైనేజీ నీటిలో పడుతూ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని వాపోతున్నారు. సందేట్లో సడేమియాలా పార్కు కోసం వదిలిన సుమారు 1500 చదరపు గజాలు స్థలాన్ని కాజేసేందుకు కొందరు నాయకులు ప్రయత్నం చేస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.
డ్రైనేజీ ఔట్ లెట్ సమస్య పరిష్కరించాలి.. వరుణ్ రెడ్డి
ఇక్కడ ఇళ్లు కొని నివాసం ఉంటున్నాం. ఈ కాలనీ సమస్య ప్రధానంగా డ్రైనేజీ ఔట్ లెట్ సమస్య. స్థానిక అపార్ట్మెంట్‌ల డ్రైనేజీ నీరు ఓకే దగ్గర చేరి కుంటలా మారి ఇబ్బందులు కల్గిస్తుంది. చెడు వాసనలతో ఉండలేక పోతున్నాం. సమస్యను మున్సిపల్ అధికారులు పరిష్కరించాలని కోరుతున్నాం.
అధికారులు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదు.. అరుణ్ రావు
సాయి కృష్ణ కాలనీ డ్రైనేజీ సమస్య పట్ల అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. ఇప్పటి కైనా ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని వెంటనే ఈ సమస్య పరిష్కరించాలి.